ఇలాంటి సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లా?:రజినీకాంత్
- April 08, 2018
కావేరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు కోసం తమిళనాట ఉద్యమం ఉధృతమైంది. పార్టీ ఆందోళనకు సినిమావాళ్లు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. కేంద్రం కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ తమిళ నటినటుల సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది. నడిగర్ సంఘం అధ్యక్షుడు నాజర్ నేతృత్వంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో సినీనటులు విశాల్, సూర్య, కార్తీ, విజయ్, సత్యరాజ్, శివకార్తికేయన్, ఆర్కే సెల్వమణి, ధాను తదితరులు పాల్గొన్నారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌లు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ అంశంపై తమిళ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. అటు రాష్ట్రంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మరోవైపు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం నాయకుడు టీటీవీ దినకరన్, క్రికెట్ అభిమానులు ఈ సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసి తమిళ రైతులకు అండగా నిలవాలని, కావేరి బోర్డు కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







