మనిషి సూర్యుడిపైకి పంపుతున్న తొలి స్పేస్‌క్రాఫ్ట్!!
- April 08, 2018
వాషింగ్టన్: చంద్రుడు, సౌరకుటుంబంలోని ఇతర గ్రహాల వేట ఓవైపు నడుస్తుండగానే నాసా సూర్యుడిపై కన్నేసింది. మానవ చరిత్రలో తొలిసారి సూర్యుడి అధ్యయనం కోసం ఓ స్పేస్‌క్రాఫ్ట్‌ను పంపడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఆ మిషన్ పేరు పార్కర్ సోలార్ ప్రోబ్. ఈ ప్రతిష్టాత్మక మిషన్ లాంచ్‌కు జులై 31న ముహూర్తం ఖరారు చేశారు. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌ను ఇప్పటికే అమెరికా ఎయిర్‌ఫోర్స్ ఫ్లోరిడాకు తీసుకెళ్లింది. అక్కడి నుంచి డెల్టా ఫోర్ హెవీ లాంచ్ వెహికిల్ ద్వారా ఈ స్పేస్‌క్రాఫ్ట్ నింగికి ఎగరనుంది. ఈ మూడు నెలల పాటు ఫ్లోరిడాలోనే స్పేస్‌క్రాఫ్ట్‌కు తుది మెరుగులు దిద్దనున్నారు. దీనిని లాంచ్ చేసిన తర్వాత ఇది నేరుగా సూర్యుడి బయటి వాతావరణమైన కరోనాకు దగ్గరగా వెళ్లనుంది. చరిత్రలో ఇప్పటి వరకు మనిషి రూపొందించిన ఏ స్పేస్‌క్రాఫ్ట్ అంత వరకు వెళ్లలేదు. సూర్యుడి వేడి, రేడియేషన్‌ను తట్టుకుంటూనే ఇది కరోనా గురించి అధ్యయనం చేస్తుంది. ఇందులో ఇంధనం నింపే ముందు చివరిగా స్పేస్‌క్రాఫ్ట్‌కు అవసరమైన రక్షణ కవచం థర్మల్ ప్రొటెక్షన్ సిస్టమ్‌ను అమర్చుతారు. సూర్యుడి వేడిని తట్టుకునేలా తయారు చేసిన ఈ రక్షణ కవచం ఓ మైలురాయిగా చెప్పవచ్చు. పార్కర్ సోలార్ ప్రోబ్ కరోనాకు 98 కిలోమీటర్ల దగ్గరిగా వెళ్లనుంది. ఫ్లోరిడాలోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి ఈ పార్కర్ సోలార్ ప్రోబ్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ మిషన్ మొత్తం జీవితకాలం ఏడేళ్లు. ఇది సూర్యుడి గురించి ఇప్పటివరకు తెలియని విషయాలను వెల్లడించనుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







