ఇలాంటి సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లా?:రజినీకాంత్

- April 08, 2018 , by Maagulf
ఇలాంటి సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లా?:రజినీకాంత్

కావేరి రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డు కోసం తమిళనాట ఉద్యమం ఉధృతమైంది. పార్టీ ఆందోళనకు సినిమావాళ్లు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు. కేంద్రం కావేరీ నదీ యాజమాన్య బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ తమిళ నటినటుల సంఘం నిరసన కార్యక్రమం చేపట్టింది. నడిగర్‌ సంఘం అధ్యక్షుడు నాజర్‌ నేతృత్వంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో సినీనటులు విశాల్‌, సూర్య, కార్తీ, విజయ్‌, సత్యరాజ్‌, శివకార్తికేయన్, ఆర్కే సెల్వమణి, ధాను తదితరులు పాల్గొన్నారు. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌లు కూడా నిరసనలో పాల్గొన్నారు. ఇప్పటికే ఈ అంశంపై తమిళ ఎంపీలు పార్లమెంట్‌ను స్తంభింపజేసిన విషయం తెలిసిందే. అటు రాష్ట్రంలోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి.

మరోవైపు అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం నాయకుడు టీటీవీ దినకరన్, క్రికెట్ అభిమానులు ఈ సమయంలో ఐపీఎల్ మ్యాచ్‌లను బాయ్‌కాట్ చేసి తమిళ రైతులకు అండగా నిలవాలని, కావేరి బోర్డు కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com