సింగపూర్ ప్రతిపక్ష నేతగా భారత సంతతి ఎంపీ

సింగపూర్ ప్రతిపక్ష నేతగా భారత సంతతి ఎంపీ

సింగపూర్ ప్రతిపక్ష పార్టీ నేతగా భారత సంతతి ఎంపీ ప్రీతం సింగ్(41) ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో సింగపూర్ ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ కొత్త సెక్రటరీ జనరల్‌గా ప్రీతంను ఎన్నుకున్నారు. 2011 మే లో జరిగిన ఎన్నికల్లో థియా ఖియాంగ్‌పై న్యాయవాది అయిన ప్రీతం విజయం సాధించారు. 2001 నుంచి వర్కర్స్ పార్టీ సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న లో యువతకు ప్రాధాన్యం ఇవ్వడం కోసం ఇకపై తాను ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించారు. దీంతో ప్రీతం సింగ్ కు అవకాశం దక్కింది.

 

Back to Top