కార్న్ ఫ్లోర్ హల్వ
- April 09, 2018చేయడానికి పట్టే సమయం: 20 నుంచి 30 నిమిషాలు.
కావలసిన పదార్ధాలు: కార్న్ ఫ్లోర్- 1 గ్లాస్, పంచదార- 1.5 గ్లాస్, పాలు-2 గ్లాసులు, మంచి నీరు- 2 గ్లాసులు, ఏలకుల పొడి- 1 టీ స్పూన్, జీడిపప్పులు- 15.
తయారీ విధానం:
కాపర్ బోటమ్ ఉన్న గిన్నె తీసుకుని అందులో కార్న్ ఫ్లోర్, పంచదార, పాలు, నీరు పోయాలి. గరిటెతో తిప్పుతూ ఉండలు రాకుండా చూసుకోవాలి. స్టవ్ మీద పెట్టి సన్న సెగలో చిక్కటి పేస్ట్ గా తయారయ్యే వరకు తిప్పుతూ ఉండాలి. ఇది సుమారు 15-20 నిమిషాలు పట్టొచ్చు. చిక్కటి పేస్ట్ తయారయ్యాక అందులో ఏలకుల పొడి కలపాలి. ఒక పళ్లేనికి నెయ్యి రాసి ఆ పేస్ట్ ను అందులో పొయ్యాలి. దానిని 10 నిమిషాలు గాలి తగిలేలా వదిలేయాలి. ఈ లోగా జీడిపప్పుని సన్న సెగపై నేతిలో దోరగా వేయించాలి. చల్లారాక డైమండ్ ఆకారంలో ముక్కలు కోసుకోవాలి. నేతిలో వేయించిన జీడిపప్పు ఒక్కో ముక్క మీద పెట్టాలి. అంతే..."కార్న్ ఫ్లోర్ హల్వ" రెడీ.
--- సి.మాధురి, హైదరాబాద్.
తాజా వార్తలు
- క్రిప్టో కరెన్సీ, బ్లాక్ చైన్ సహా సరికొత్త ఆర్థిక నేరాలపై ఫోకస్: డీజీపీ అంజనీ కుమార్
- ముగిసిన హెచ్-1బీ వీసా అప్లికేషన్లు..
- మెక్సికో నగరంలో ఘోర అగ్నిప్రమాదం..39 మంది మృతి
- హైదరాబాద్ లో ఆస్కార్ విజేత చంద్రబోస్కు సత్కారం..
- జీ-20 సదస్సు-2023కు విశాఖ రెడీ
- ప్రజాగ్రహంతో దిగొచ్చిన ఇజ్రాయెల్ ప్రధాని..
- హైదరాబాద్ నగరాన్ని ఆహ్లాదకరంగా మార్చేందుకు కృషి
- పాన్-ఆధార్ లింక్ గడువు పెంపు..
- అదనపు ఆదాయాన్నిచ్చే ‘సెకండ్ శాలరీ’..!
- ఆకాశంలో కనువిందు చేయనున్న 5 గ్రహాలు..!