గోల్డ్ మెడల్ సాధించిన హీనా.. బాక్సింగ్‌లో మరో ఇద్దరు సెమీస్‌కు
- April 10, 2018
కామన్ వెల్త్‌లో మరో గోల్డ్ మెడల్ భారత్ ఖాతాలో చేరింది. మహిళల 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో అద్భుతమైన ప్రదర్శన చేసిన భారత షూటర్ హీనా సిద్ధు స్వర్ణాన్ని సాధించింది. మొత్తం 38 పాయింట్లు సాధించిన హీనా.. కామన్‌వెల్త్ గేమ్స్ రికార్డును సృష్టించింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో సిల్వర్ సాధించిన సిద్ధూ.. 25 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మరింత మెరుగ్గా రాణించి బంగారు పతకాన్ని దక్కించుకోవడం విశేషం. మరో భారత అమ్మాయి అనుసింగ్ ఆరోస్థానంలో నిలిచింది. హీనా సాధించిన గోల్డ్ మెడల్‌తో.. భారత్ పతకాల సంఖ్య 20కి చేరింది. ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లో జరుగుతున్న ఈ కామన్ వెల్త్ గేమ్స్‌లో ఇంతవరకూ 11 స్వర్ణాలు.. 4 రజతాలు.. 5 కాంస్యాలు మనకు దక్కాయి.
అటు బాక్సింగ్‌లోనూ భారత క్రీడాకారులు సెమీస్‌కు చేరుకుని పతకాలు ఖాయం చేసుకున్నారు. 46 కేజీల విభాగంలో అమిత్ పంఘాల్.. స్కాట్లాండ్ ప్లేయర్‌పై విజయం సాధించగా.. 91 కేజీల విభాగంలో నమన్ తన్వర్.. సమోవాకు చెందిన బాక్సర్‌ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లారు.
తాజా వార్తలు
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!







