కారు నెంబర్ ప్లేట్.. రేటు వింటే అవుట్: రూ.132 కోట్లు మరి

- April 10, 2018 , by Maagulf
కారు నెంబర్ ప్లేట్.. రేటు వింటే అవుట్: రూ.132 కోట్లు మరి

రోడ్డు మీద వెళుతున్నప్పుడు రయ్ మంటూ దూసుకుపోతున్న కార్లను చూస్తాము. వాటితో పాటు మనకు తెలియకుండానే కారు నెంబర్ ప్లేట్‌పై కూడా మన దృష్టి పడుతుంది. నెంబర్ బాగుంటే భలేవుంది కదా అని పక్కన వాళ్లకి చెబుతాము. మరి అలాంటి ఫ్యాన్సీ నెంబర్ కావాలంటే కొంత ఆర్‌టీఏ అధికారులకి సమర్పించుకోవాలి. ఈ నెంబర్ల కోసం వేల నుంచి లక్షల వరకు పెడతారని తెలుసు. అయితే బ్రిటన్‌కు చెందిన ఓ కారు యజమాని నెంబర్ ప్లేట్ ధరను ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.132 కోట్లు చెప్పాడు. ఇంతకీ ఆ నెంబర్ పేరు 'F1' కావడమే దానికి అంత క్రేజ్ అని చెప్పుకొచ్చాడు. ఈయన ఓ డిజైన్ సంస్థకు యజమాని. అతడు కూడా ఈ నెంబర్‌ను ఇంతకు ముందు 10.52 కోట్లకు కొనుగోలు చేశాడు. దాన్ని ఇప్పుడు ఇంత లాభానికి అమ్మాలనుకుంటున్నాడు. అందుకు వేలం పాటను కూడా ఏర్పాటు చేశాడు. దాని ధరను రూ.110 కోట్లు నిర్ణయించి, పన్నులు గట్రా కలుపుకుని సింపుల్‌గా రూ.132 కోట్లు ఇస్తే సరిపోతుందని అంటున్నాడు. బ్రిటన్‌లో నెంబర్ ప్లేట్‌కి ఉన్న క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఇంత రేటు చెబుతున్నాడు. ఇక్కడివారికి నెంబర్ ప్లేట్లను తిరిగి విక్రయించుకునే సదుపాయం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com