వరల్డ్ నంబర్ 1.. కిడాంబి శ్రీకాంత్
- April 10, 2018
ప్రపంచ బ్యాడ్మింటన్‌లో సూపర్ ఫామ్‌తో దూసుకెళ్తున్న తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించబోతున్నాడు. బ్యాడ్మింటన్ పురుషుల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు దిశగా సాగుతున్నాడు. మరో రెండు రోజుల్లో బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విడుదల చేయబోయే జాబితాలో శ్రీకాంత్‌కు మొదటి ర్యాంక్ దక్కబోతోంది. ప్రస్తుతం 77,130 పాయింట్లతో విక్టర్ అక్సెల్సన్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంకులో ఉన్నాడు. గాయం కారణంగా కొద్ది రోజులుగా మ్యాచులకు దూరంగా ఉండడంతో విక్టర్..1,660 పాయింట్లు కోల్పోబోతున్నాడు. దీంతో ప్రస్తుతం 76, 895 పాయింట్లతో ఉన్న శ్రీకాంత్‌కు నంబర్ వన్ ర్యాంకు ఖరారైనట్టే. గతేడాదే శ్రీకాంత్‌కు నంబర్ వన్ ర్యాంకు దక్కాల్సి ఉన్నప్పటికీ.. గాయం కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోయాడు.
తాజా వార్తలు
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్







