అల్ ఐన్: హాస్పిటల్ బిల్డింగ్ మీద నుంచి దూకి నర్సు ఆత్మహత్య
- April 10, 2018
అల్ ఐన్: ఎమిరేట్స్‌లో కేరళకు చెందిన సుజా సింగ్ అనే నర్సు ఆత్మహత్య చేసుకున్నది. అల్ ఐన్ హాస్పిటల్ బిల్డింగ్ మీద నుంచి కింద దూకి ఆమె ప్రాణాలు విడిచినట్లు పోలీసులు తెలిపారు. 40 ఏళ్లు దాటిన ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్లు విదేశాల్లో చదువుకుంటున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి ఆమె అల్ ఐన్ హాస్పిటల్ లో హెడ్ నర్స్‌గా పనిచేస్తున్నది. సుజా ఆత్మహత్య చేసుకోవడంతో హాస్పిటల్ వర్గాలు షాక్‌కు గురయ్యాయి. హాస్పిటల్ ఉద్యోగులతో ఆమె మంచిగానే ఉండేదని అధికారులు చెప్పారు. సుజా సింగ్ కొన్నాళ్ల క్రితం తన భర్త నుంచి విడాకులు తీసుకున్నది. అయితే పిల్లలుకు తల్లి ఆత్మహత్యకు గురించి హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. కానీ తల్లి మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు పిల్లలు నిరాకరించినట్లు పోలీసులు చెప్పారు. దీంతో హాస్పిటల్ వర్గాలు సుజా సింగ్ మృతదేహానికి ఎమిరేట్స్‌లోనే అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







