ఫేక్ ప్రమోషనల్ ఆఫర్స్: లులు హెచ్చరిక
- April 13, 2018
లులు హైపర్ మార్కెట్స్‌కి సంబంధించి డిస్కౌంట్ వోచర్స్ పేరుతో ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్ వెళుతుండడాన్ని 'స్కామ్'గా అభివర్ణిస్తూ, లులు సంస్థ తమ షాపర్స్ని అప్రమత్తం చేసింది. ఇలాంటి ఫ్రాడెంట్ మెసేజ్‌ల పట్ల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా వుండాలనీ, తమకు ఫిర్యాదు చేయాలని వినియోగదారులకు సంస్థ యాజమాన్యం ఓ ప్రకటన ద్వారా పేర్కొంది. పోలీసులకు ఈ విషయమై ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు సంబంధిత ఫిర్యాదు వివరాల్ని ప్రకటనలో వెల్లడించింది లులు సంస్థ. బహుమతులు గెల్చుకున్నారంటూ ఫోన్ కాల్స్ వినియోగదారులకు వెళుతున్నాయనీ, తద్వారా వినియోగదారుల పర్సనల్ డిటెయిల్స్‌ని సేకరిస్తున్నారనీ, వారి నుంచి డబ్బులు కూడా గుంజుతున్నారని లులు సంస్థ వెల్లడించింది. బ్యాంకింగ్, క్రెడిట్ కార్డులకు సంబంధించిన వివరాల్ని లులు సంస్థ సేకరించబోదని సంస్థ ప్రతినిథులు స్పష్టం చేశారు. లులు గ్రూపు అధికారిక సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా మాత్రమే ఆఫర్లు, ప్రైజ్‌ల వివరాల్ని తెలుసుకోగలరని సంస్థ పేర్కొంది.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







