కూతురినే పెళ్లి చేసుకుని ఆపై..
- April 14, 2018
సమాజం ఎటు పోతోంది. వావి వరుసలు లేకుండా పోతున్నాయి. చేస్తున్న పని మంచిదా కాదా అని ఒక్క క్షణమైనా ఆలోచించట్లేదు. వాషింగ్టన్కు చెందిన ఓ వ్యక్తి కన్నకూతురితోనే వివాహ బంధాన్ని కొనసాగించి బిడ్డను కూడా కన్నాడు. ఆపై అనుమానంతో ఆమెను, బిడ్డను కాల్చి తానూ కాల్చుకుని మరణించాడు. వాషింగ్టన్ నార్త్ కరోలినాకు చెందిన స్టీవెన్ ప్లాదల్ తన కూతురు క్యాటీని పుట్టినప్పుడే న్యూయార్క్‌కు చెందిన ఆంటోనీ ఫస్కో అనే వ్యక్తికి దత్తత ఇచ్చాడు. అయితే క్యాటీకి తనని కన్న తల్లిదండ్రులని చూడాలనిపించి ఓ రోజు వారివద్దకు వచ్చింది. అలా అప్పుడప్పుడు వచ్చి పోతుండడం అలవాటైంది. ఈ క్రమంలో కన్న తండ్రి క్యాటీతో సన్నిహితంగా మెలగసాగాడు. క్రమంగా అది వారిద్దరి మధ్య శారీరక సంబంధానికి దారితీసింది. దాంతో ఇద్దరూ వివాహం కూడా చేసుకున్నారు. క్యాటీ ఓ బిడ్డకు తల్లి కూడా అయింది.
తండ్రీ కూతుళ్లు భార్యా భర్తలు కావడాన్ని సహించలేని సమాజం అతన్ని కోర్టుకు ఈడ్చింది. అతడిపై కేసు నమోదై జైలుకు కూడా వెళ్లవలసి వచ్చింది. శిక్షానంతరం జైలు నుంచి విడుదలైన స్టీవెన్ మళ్లీ క్యాటీకి దగ్గరయ్యాడు. అయితే స్టీవెన్ జైలులో ఉన్నప్పుడు క్యాటీ వేరొకరితో సంబంధం పెట్టుకుని ఉందన్న అనుమానం వచ్చింది అతడికి. క్యాటీ చర్యలతో అది కాస్తా బలపడింది. ఇదే విషయంపై వీరిద్దరి మధ్యా తరచూ గొడవలు కూడా జరుగుతుండేవి. గొడవ తీవ్రమవడంతో బుధవారం రాత్రి కొడుకు బెన్నెట్‌ను స్టీవెన్ చంపేశాడు. అనంతరం క్యాటీని, ఆమెను దత్తత తీసుకున్న తండ్రిని స్టీవెన్ ఓ వ్యానులో నిర్జన ప్రదేశానికి తీసుకు వెళ్లి కాల్చి చంపేశాడు. అనంతరం అతడు క్యాటీ తల్లికి హత్య చేసిన సమాచారాన్ని అందించాడు. సమాచారం అందుకున్న ఆమె వచ్చేలోపే తాను కూడా కాల్చుకుని మరణించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాల్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తాజా వార్తలు
- ఔద్ మైథా రోడ్–అల్ అసాయెల్ స్ట్రీట్ అభివృద్ధి పనులు పూర్తి
- సెప్టెంబర్ 23న షేక్ మహమ్మద్ లీడర్షిప్ ఫోరం
- స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీ, విద్యా సంస్థల్లో అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
- షార్జా–ఒమన్ కారిడార్‌లో సరుకు రవాణా విలువ 66.26 శాతం వృద్ధి
- దుబాయ్: సోనాపూర్ క్యాంప్‌లో ఘనంగా గణేష్ ఉత్సవాలు..
- ఫుజైరా టెర్మినల్స్–అబుదాబి మధ్య ఎతిహాద్ రైల్ సర్వీస్ ప్రారంభం
- సెప్టెంబర్ 21 నుంచి షార్జా సఫారీ ఐదో సీజన్ ప్రారంభం
- ఖతార్‌లో సెప్టెంబర్ 20 నుంచి ‘అల్-జుబ్రా’ నక్షత్ర దశ.. వాతావరణంలో మార్పులు
- అక్టోబర్ 8 నుంచి అమెజాన్ సేల్
- దుబాయ్‌లో భారతీయులకు ఉచిత న్యాయ సలహాలు..







