రైస్ బోండాలు

- December 03, 2015 , by Maagulf
రైస్ బోండాలు

కావలసిన పదార్థాలు: అన్నం - 200 గ్రా., వెన్న - 100 గ్రా., క్యాప్సికం - 100 గ్రా., ఉల్లి - 50 గ్రా., కొత్తిమీర - 20 గ్రా., వాము ఆకు - 10 గ్రా., లావు మిర్చి - 50 గ్రా., బ్రెడ్‌పొడి - 100 గ్రా., గిలకొట్టిన గుడ్లు - 2, ఉప్పు, మిరయాల పొడి రుచికి తగినంత, వేగించడానికి సరిపడ నూనె.
తయారుచేసే విధానం: క్యాప్సికం, ఉల్లి, మిర్చి, వాముఆకు, కొత్తిమీరలను సన్నగా తరిగి పొట్టుకోండి. బ్రెడ్‌పొడి, గుడ్లు తప్పించి మిగతా అన్ని పదార్థాలను ఒక వెడల్పాటి పాత్రలో వేసి కలుపుకోవాలి. ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. తర్వాత ఉండల్ని పిండిలో దొర్లించి, గిలకొట్టిన గుడ్డు సొనలో ముంచి, మళ్లీ బ్రెడ్‌పొడిలో పొర్లించాలి. వీటిని నూనెలో వేగించుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com