సులువుగా అయ్యప్పను దర్శించుకునే అవకాశం..
- December 03, 2015
అయ్యప్పమాలధారణ చేసి మండలదీక్ష (41రోజులు) చేపట్టి కఠోర నియమ నిష్టలతో దాన్ని పూర్తిచేసి ఇరుముడి దాల్చి శబరి గిరీశుణ్ణి దర్శించుకునేందుకు ఏటా లక్షలాదిమంది భక్తులు కేరళ వెళ్తున్నారు. 18 మెట్లను ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు పవిత్ర కార్తీక మాసాన ఏటా మాలధారణ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. చిలకలూరిపేట టౌన్ : నల్లని వస్రాలు ధరించి తలపై ఇరుముడితో మెడలో మాలలతో మదినిండా అయ్యప్ప నామస్మరణతో కరిమల వాసుని కనులారా దర్శించుకునేందుకు మండల దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి రోజూ వేలల్లో మాలధారులు శబరిమల వద్ద స్వామి దర్శనానికి బారులు తీరుతున్నారు. దీనితో అక్కడ ఇబ్బందులు తప్పని పరిస్థితి. భక్తులకు ఇబ్బందులు తొలగించేందుకు కేరళ ప్రభుత్వం ఇంటర్నెట్‌లో టిక్కెట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టింది. అందులో టిక్కెట్ నమోదు చేసుకోవడం ద్వారా వారు సూచించిన సమయానికి దర్శనం సులువుగా అయ్యే అవకాశాలున్నాయి. దీనితో సమయం ఆదా కావడం, వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రయాణం సు లువుగా ముగించుకుని తిరుగుప్రయాణం కావచ్చు. టిక్కెట్‌బుకింగ్ చేసుకునే విధానం ఇలా... కంప్యూటర్‌నుంచి ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన వారు ముందుగా గుగూల్ పోర్టల్ ను తెరవాలి. అందులో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎ్‌సఎబిఎఆర్‌ఐఎమ్‌ఎఎల్‌ఎ విఐఆర్‌టియుఎఎల్‌క్యు పిఒఆర్‌టిఎఎల్ అని టైప్ చేయాలి. అక్కడ కేరళ పోలీస్ వెల్‌కమ్స్ పిలిగ్రిమ్స్ అని ఇంగ్లీషులో కనిపిస్తుంది. దాని కిందనే సెర్చ్ ఎవైలబిలిటీ అని కనిపిస్తుంది. దానికింద నవంబర్ 2015అని కనిపిస్తుంది. దానికి ప్రక్కకు క్లిక్ చేస్తే డిసెంబర్ 2015, జనవరి 2016 మాసాలు కూడా పొందుపరచబడి ఉంటాయి. భక్తులు ఏ నెలలో అయ్యప్ప దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడ నమోదు చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి. ఆనెలలో తేదీలు కనిపిస్తాయి. అక్కడ గడి ఎరుపురంగులో ఉంటే ఆ తేదీలలో బుకింగ్ పూర్తి అయినట్టుగా భావించాలి. తెలుపురంగులో ఉంటే ఆరోజు బుకింగ్ లేదని అర్థం. అప్పుడు ఆకుపచ్చ గడుల్లోని తేదీలపై క్లిక్ చేయగానే అది నీలి రంగులోకి మారుతుంది. పక్కనే దర్శనవేళలు సైతం కనిపిస్తాయి. సమయాన్ని బుక్ చేసుకోవాలి. అప్పుడు కోడ్ అడుగుతుంది. అక్కడ కనిపించే కోడ్‌ను గడిలో టైప్ చేయాలి. అనంతరం గెస్ట్ ఫ్రొఫైల్ అనే పేజీ కనిపిస్తుంది. అందులో దర్శనానికి వెళ్తున్న వ్యక్తిపేరు, చిరునామా, రాష్ట్రం, సెల్‌ఫోన్ నెం బరు తదితర వివరాలు ఉంటా యి. చిరునామాకు సంబంధించి ఆధార్‌కార్డు లేదా రేషన్‌కార్డు లేదా ఓటరుకార్డు వివరాల నమోదుతోపాటు ఫొటో, ఏదో ఒక గుర్తింపుకార్డు నకలు అప్‌లోడ్ చేయాలి. అనంతరం దా న్ని ప్రింటు తీసుకోవచ్చు. దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆ కాగితంతోపాటు మనం అప్‌లోడ్ చేసిన గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. తద్వారా నమోదు చేసుకున్న వేళల్లో సు లువుగా అయ్యప్పను దర్శించుకునే అవకాశం ఉంటుంది. అయ్యప్పమాలధారణ చేసి మండలదీక్ష (41రోజులు) చేపట్టి కఠోర నియమ నిష్టలతో దాన్ని పూర్తిచేసి ఇరుముడి దాల్చి శబరి గిరీశుణ్ణి దర్శించుకునేందుకు ఏటా లక్షలాదిమంది భక్తులు కేరళ వెళ్తున్నారు. 18 మెట్లను ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు పవిత్ర కార్తీక మాసాన ఏటా మాలధారణ చేసేవారి సంఖ్య పెరుగుతోంది. చిలకలూరిపేట టౌన్ : నల్లని వస్రాలు ధరించి తలపై ఇరుముడితో మెడలో మాలలతో మదినిండా అయ్యప్ప నామస్మరణతో కరిమల వాసుని కనులారా దర్శించుకునేందుకు మండల దీక్ష పూర్తి చేసుకున్న భక్తులు ప్రయాణాలకు సిద్ధమవుతున్నారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి రోజూ వేలల్లో మాలధారులు శబరిమల వద్ద స్వామి దర్శనానికి బారులు తీరుతున్నారు. దీనితో అక్కడ ఇబ్బందులు తప్పని పరిస్థితి. భక్తులకు ఇబ్బందులు తొలగించేందుకు కేరళ ప్రభుత్వం ఇంటర్నెట్‌లో టిక్కెట్ బుకింగ్‌ను ప్రవేశపెట్టింది. అందులో టిక్కెట్ నమోదు చేసుకోవడం ద్వారా వారు సూచించిన సమయానికి దర్శనం సులువుగా అయ్యే అవకాశాలున్నాయి. దీనితో సమయం ఆదా కావడం, వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రయాణం సు లువుగా ముగించుకుని తిరుగుప్రయాణం కావచ్చు. టిక్కెట్‌బుకింగ్ చేసుకునే విధానం ఇలా... కంప్యూటర్ నుంచి ఇంటర్నెట్ సౌకర్యం కలిగిన వారు ముందుగా గుగూల్ పోర్టల్ ను తెరవాలి. అందులో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎ్‌సఎబిఎఆర్‌ఐఎమ్‌ఎఎల్‌ఎ విఐఆర్‌టియుఎఎల్‌క్యు పిఒఆర్‌టిఎఎల్ అని టైప్ చేయాలి. అక్కడ కేరళ పోలీస్ వెల్‌కమ్స్ పిలిగ్రిమ్స్ అని ఇంగ్లీషులో కనిపిస్తుంది. దాని కిందనే సెర్చ్ ఎవైలబిలిటీ అని కనిపిస్తుంది. దానికింద నవంబర్ 2015అని కనిపిస్తుంది. దానికి ప్రక్కకు క్లిక్ చేస్తే డిసెంబర్ 2015, జనవరి 2016 మాసాలు కూడా పొందుపరచబడి ఉంటాయి. భక్తులు ఏ నెలలో అయ్యప్ప దర్శనానికి వెళ్లాలనుకుంటున్నారో అక్కడ నమోదు చేసి సెర్చ్‌పై క్లిక్ చేయాలి. ఆనెలలో తేదీలు కనిపిస్తాయి. అక్కడ గడి ఎరుపురంగులో ఉంటే ఆ తేదీలలో బుకింగ్ పూర్తి అయినట్టుగా భావించాలి. తెలుపురంగులో ఉంటే ఆరోజు బుకింగ్ లేదని అర్థం. అప్పుడు ఆకుపచ్చ గడుల్లోని తేదీలపై క్లిక్ చేయగానే అది నీలి రంగులోకి మారుతుంది. పక్కనే దర్శనవేళలు సైతం కనిపిస్తాయి. సమయాన్ని బుక్ చేసుకోవాలి. అప్పుడు కోడ్ అడుగుతుంది. అక్కడ కనిపించే కోడ్‌ను గడిలో టైప్ చేయాలి. అనంతరం గెస్ట్ ఫ్రొఫైల్ అనే పేజీ కనిపిస్తుంది. అందులో దర్శనానికి వెళ్తున్న వ్యక్తిపేరు, చిరునామా, రాష్ట్రం, సెల్‌ఫోన్ నెం బరు తదితర వివరాలు ఉంటా యి. చిరునామాకు సంబంధించి ఆధార్‌కార్డు లేదా రేషన్‌కార్డు లేదా ఓటరుకార్డు వివరాల నమోదుతోపాటు ఫొటో, ఏదో ఒక గుర్తింపుకార్డు నకలు అప్‌లోడ్ చేయాలి. అనంతరం దా న్ని ప్రింటు తీసుకోవచ్చు. దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆ కాగితంతోపాటు మనం అప్‌లోడ్ చేసిన గుర్తింపుకార్డును వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది. తద్వారా నమోదు చేసుకున్న వేళల్లో సు లువుగా అయ్యప్పను దర్శించుకునే అవకాశం ఉంటుంది.
తాజా వార్తలు
- DXB టెర్మినల్ 1 కి వెళ్లే బ్రిడ్జి విస్తరణ..!!
- కువైట్ లో జీరో టెంపరేచర్స్ పై హెచ్చరిక..!!
- బహ్రెయిన్ ప్రభుత్వ పాఠశాలల్లో స్పెషల్ స్పోర్ట్స్ ట్రైనర్లు..!!
- దోహా అంతర్జాతీయ బుక్ ఫెయిర్ అవార్డుకు నామినేషన్లు..!!
- న్యూ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నిర్మాణంపై జజాన్ ఎమిర్ సమీక్ష..!!
- రష్యా, ఒమన్ సంబంధాల బలోపేతంపై సమీక్ష..!!
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్







