పెన్నును గన్ అనుకొని.. విమానాన్ని మళ్లించి..!
- April 15, 2018
బీజింగ్: ఎయిర్ చైనా విమానంలో ఓ ప్రయాణికుడు ఓ పెన్నుతో చేసిన హంగామా.. అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. చాంగ్షా నుంచి బీజింగ్ వెళ్లాల్సిన ఈ విమానంలో ఓ ప్రయాణికుడు ఓ ఫౌంటేన్ పెన్ను సాయంతో ైఫ్లెట్ అటెండెంట్‌ను బందీగా చేసుకున్నాడు. దీంతో బీజింగ్ వెళ్లాల్సిన ఆ విమానాన్ని మధ్య చైనాలోని ఝెంగ్ఝౌ సిటీకి తరలించారు. ఉదయం 8.40 గంటలకు చాంగ్షా నుంచి టేకాఫ్ అయిన ఈ విమానం 11 గంటలకు బీజింగ్ చేరాల్సి ఉంది. ఈ ఘటనతో పది గంటల సమయంలో ఝెంగ్ఝౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అందులో ఉన్న ప్రయాణికులందరినీ ఎలాంటి హాని కలగకుండా కిందికి దించేసినట్లు సివిల్ ఏవియేషన్ అథారిటీ ఆఫ్ చైనా వెల్లడించింది. మధ్యాహ్నం 1.17 గంటల కల్లా ఈ ఆపరేషన్ పూర్తయినట్లు వివరించింది. అయితే ఆ అగంతకుడి వివరాలు మాత్రం చెప్పలేదు. అయితే విమానం హైజాక్ అవుతుందేమో అన్న భయంతో ఎయిర్‌పోర్ట్‌లో వందల కొద్దీ పారామిలిటరీ పోలీసులను రంగంలోకి దింపారు. కొన్ని అంబులెన్స్‌లను కూడా ఎయిర్‌పోర్ట్ దగ్గర ముందు జాగ్రత్త చర్యగా ఉంచారు. ఈ విమానంలోని ప్రయాణికులను మరో విమానంలో బీజింగ్‌కు పంపిస్తామని ఝెంగ్ఝౌ ఎయిర్‌పోర్ట్ అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







