క్రిస్ గేల్‌కి అరుదైన గౌరవం
- April 21, 2018
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్ పంజాబ్ జట్టు ఓపెనర్ క్రిస్ గేల్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లోని బెల్ని మోగించి గేల్ మ్యాచ్‌ను ప్రారంభించాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ 11వ సీజన్లో జరిగిన మ్యాచుల్లో కింగ్స్ పంజాబ్ జట్టు తరఫున గేల్ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కానీ ఆడిన రెండు మ్యాచుల్లో 68, 103 పరుగులు చేసి తన సత్తా చాటుకున్నాడు. దీంతో ఇప్పుడు మూడో మ్యాచ్ ఆడుతున్న గేల్ ఈడెన్ గార్డెన్స్‌లో బెల్ని మోగించే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. గతంలో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్ రాహుల్ ద్రవిడ్ సహా బ్రెట్ లీ, షేన్ వార్న్ తదితరులు ఈ బెల్ మోగించారు. ఇప్పుడు ఈ జాబితాలో క్రిస్ గేల్ కూడా చేరాడు.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









