టాలీవుడ్ కమిటీ కన్వీనర్‌గా సుప్రియ
- April 21, 2018
హైదరాబాద్ : టాలీవుడ్లో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో కాస్టింగ్ కౌచ్, టాలీవుడ్ సమస్యలపై సినీ ప్రముఖులతో ఓ కమిటీని ఏర్పాటు అయింది. 21మంది సభ్యులతో ఏర్పాటు అయిన ఈ జాయింట్ యాక్షన్ కమిటీకి యార్లగడ్డ సుప్రియ కన్వీనర్‌గా నియమితులయ్యారు. ఈ కమిటీలో 24 విభాగాల అధ్యక్ష, కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అలాగే దర్శకురాలు నందినీరెడ్డి, స్వప్నాదత్ సభ్యులుగా వ్యవహరిస్తారు. ఇకనుండి ఇండస్ట్రీకి సంబంధించిన ఏ నిర్ణయమైన ఈ కమిటీదే తుది నిర్ణయం. ప్రస్తుతం సుప్రియ అన్నపూర్ణ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా వున్నారు. క్యాష్ కమిటీ ఏర్పాటు ప్రక్రియ కూడా జరుగుతోందని, త్వరలో నివేదిక వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ కమిటీలో 21 మంది సభ్యులు ఉంటారని, వారిలో సగం మంది బయటవాళ్లు (ప్రజా సంఘాలు,లాయర్లు) ఉంటారని సమాచారం. కాగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై దాదాపు రెండు గంటల పాటు వివిధ అంశాలపై సినీ ప్రముఖులు చర్చించినట్టుగా తెలుస్తోంది. శనివారం అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఈ సమావేశంలో సినీరంగానికి చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులతో పాటు 24 శాఖలకు చెందిన 80 మందికి పైగా సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- జూన్ 30న ఇండియన్ ఎంబసీ 'ఓపెన్ హౌస్' కార్యక్రమం
- సెయింట్ లూయిస్‌లో అంగరంగ వైభవంగా శ్రీనివాస కల్యాణం
- 2022 తొలి మూడు నెలల్లో డొమెస్టిక్ వర్కర్ల పెరుగుదల
- జీసీసీ జాతీయులకు వీసా విషయమై వెసులుబాటు కల్పించనున్న యూకే
- తెలంగాణ కరోనా అప్డేట్
- జూలైన్ 9న ఈద్ అల్ అదా
- వంశీ-శుభోదయం పురస్కారాలు..
- ఆన్లైన్ మోసం: గుట్టు రట్టు చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- ఫ్యామిలీ, టూరిస్ట్ విజిట్ వీసాలపై కువైట్ కీలక నిర్ణయం..!
- అంబానీ సంచలన నిర్ణయం