బీభత్సం సృష్టించిన యువతులు..తప్పతాగి ఫుట్‌పాత్‌పై
- April 22, 2018
వీకెండ్ వస్తే చాలు హైద్రాబాద్ రోడ్లపై వెళ్లాలంటే హడలెత్తాల్సిందే. ! ఎవరూ ఏవైపు నుంచి తప్పతాగి యాక్సిడెంట్ చేస్తారో తెలియని పరిస్థితి. ఆఖరికి ఫుట్‌పాత్‌పై ఉన్నా..గ్యారంటీ లేకుండాపోయింది. తాజాగా కుషాయిగూడలో పూటుగా తాగిన యువతులు..అడ్డగోలుగా కారు డ్రైవింగ్ చేశారు. ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లడంతో అక్కడే నిద్రిస్తున్న ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
ఇంజినీరింగ్ చదువుతున్న నలుగురు యువతులు వీకెండ్ పార్టీ చేసుకున్నారు. ఏమాత్రం సోయి లేకుండా పీకలదాకా తాగారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దనే మినిమమ్ సెన్స్ కూడా లేకుండా బిహేవ్ చేశారు. కారుతో రోడ్డుపైకి ఎక్కి ర్యాష్ డ్రైవింగ్ చేశారు. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తిపై నుంచి దూసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు మాత్రం..చావుబతుకుల మధ్య ఉన్న బాధితుడిని పట్టించుకోలేదు. నలుగురు యువతుల తల్లిదండ్రులతో బేరసారాలకు దిగారు. దీంతో ఇదంతా గమనిస్తున్న స్థానికులు..పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీలను నిలదీశారు.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







