'భరత్ అనే నేను' విజయోత్సవ వేడుకకు రంగం సిద్ధం
- April 24, 2018
సూపర్ స్టార్ మహేష్ బాబు, కైరా అద్వాని జంటగా నటించిన 'భరత్ అనే నేను' సినిమా బ్లాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా అదరగొట్టేశాడు. మహేష్ నటన, దేవి శ్రీ సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అంచనాలను మించి పరుగులు పెడుతోంది.
భారీ కల్లెక్షన్స్‌తో కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతున్న ఈ సినిమా పట్ల పలువురు సినీ ప్రముఖులు సైతం తమ నీరాజనాలు తెలిపారు. ఓ వైపు కలెక్షన్ల సునామీ, మరోవైపు సినీ ప్రముఖుల ప్రశంసలతో చిత్ర యూనిట్ ఆనందంలో మునిగి తేలుతోంది. ఇచ్చిన హామీ నెరవేర్చామని తెగ సంబర పడుతున్న టీమ్.. 'భరత్' విజయోత్సవ వేడుక చేసేందుకు సిద్ధమయ్యారు.
ఈ వేడుకకు తిరుపతి వేదిక కానుంది. తిరుపతిలోని అలిపిరి రోడ్‌లో ఉన్న నెహ్రూ మున్సిపల్ హైస్కూల్ గ్రౌండ్స్‌లో ఏప్రిల్ 27వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ వేడుక ప్రారంభం కాబోతోంది. ఈ మేరకు కొద్దిసేపటిక్రితమే అఫీషియల్ ప్రకటన బయటకు వచ్చింది.
తాజా వార్తలు
- యూఏఈ మొదటి విమానాశ్రయం.. మ్యూజియంగా ప్రారంభం
- ఇంటి ఓనర్ సౌకర్యాల వినియోగానికి అదనంగా వసూలు చేయవచ్చా?
- జింబాబ్వే ప్రైవేట్ విమాన ప్రమాదంలో భారతీయుడు మృతి
- 7 రోజుల్లో 11,465 మంది అరెస్ట్
- స్పెయిన్-ఒమన్ ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ ప్రారంభం
- అక్టోబర్ 2న అబుధాబిలో వాహనాల పై ఆంక్షలు
- విజయవాడ విద్యార్థులకు తానా స్కాలర్ షిప్ లు పంపిణీ...
- ఖతార్ లో ఘనంగా Mrs.CIA బ్రీఫింగ్ సెషన్
- ఫిలడెల్ఫియాలో ఘనంగా నాట్స్ ఆధ్వర్యంలో గణేశ్ ఉత్సవాలు
- అక్టోబర్ 07 వరకు రూ.2000 నోట్లు మార్పిడి చేసుకోవచ్చు