ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు
- April 26, 2024
హైదరాబాద్: వేసవి నేపథ్యంలో మరో పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ ఫార్మా కంపెనీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భవనం మొత్తం దట్టమైన పొగలు, మంటలు వ్యాపించడంతో అందులో పని చేసే ఉద్యోగులు, కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. మంటలు చిక్కుకుపోవడంతో వారంతా బయట పడేందుకు తీవ్ర తంటాలు పడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి. ఈ సంఘటన తెలంగాణలోని నందిగామలో చోటుచేసుకుంది.
హైదరాబాద్ శివారు ప్రాంతం రంగారెడ్డి జిల్లా నందిగామలో ఉన్న ఆల్విన్ ఫార్మా కంపెనీ ఉంది. ఈ కంపెనీలో శుక్రవారం సాయంత్రం 4 గంటల మధ్య మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు, పొగ వ్యాపించడంతో స్థానికంగా భయానక వాతావరణం చోటుచేసుకుంది. ప్రమాదంతో కంపెనీలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు బయటకు వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు భవనంలోని కిటికీల ద్వారా బయటకు వచ్చారు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు.
అయితే ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీ భవనంలో దాదాపు 150 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. వారంతా మంటల్లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. మంటలతో కొందరు కార్మికులు కిటికీలోంచి దూకి తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కాగా సమాచారం వార్త తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహాయ చర్యలు పర్యవేక్షించారు. అయితే ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా తెలుస్తోంది. లేదంటే వేసవి ఉష్ణోగ్రతలతో మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కానీ భారీస్థాయిలో ఆస్తి నష్టం సంభవించి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో బెంగళూరు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో కొత్త స్కానర్లు..
- భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్..
- మసందమ్‌లో కొత్త రహదారి..ఖసబ్-దిబ్బా ప్రయాణ సమయం 55 నిమిషాలకు తగ్గింపు
- హైదరాబాద్ లో అతిపెద్ద క్రికెట్ స్టేడియం..
- ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం
- యూఏఈలో త్వరలో స్టార్‌లింక్.. ముందస్తు బుకింగ్ ఎలాగంటే?
- ఖతార్‌లో వరల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫోరం 2026..!!
- బహ్రెయిన్‌లోని రిఫాలో ట్రాఫిక్ రద్దీకి చెక్..!!
- గల్ఫ్ పౌరుడి హత్య కేసులో బంగ్లాదేశీయుడు అరెస్ట్..!!
- సౌదీలో ఉరుములు.. భారీ వర్షాలు.. 48 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు..!!







