ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న విచారణ: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- April 26, 2024
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా సీరియస్‌గా దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ..కేసులో కీలక నిందితుడైన అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదనే వాదన తప్పు అని ఆయన తెలిపారు.ప్రభాకర్‌ను ఇండియాకు రప్పించే యత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.
అదేవిధంగా ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదని, లుక్ అవుట్ నోటీసులు మాత్రం జారీ చేశామని వెల్లడించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో అంతర్జాతీయ దర్యాప్తు సంస్థ ఇంటర్‌పోల్‌ను సంప్రదించలేదని సీపీ క్లారిటీ ఇచ్చారు. ట్యాపింగ్ ఏ స్థాయిలో జరిగిందనే విషయం త్వరలోనే తేలుస్తామన్నారు. సమయం వచ్చినప్పుడు కేసుకు సంబంధం ఉన్న రాజకీయ నాయకుల వ్యవహారంపై కూడా స్పందిస్తామని సీపీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- షార్జాలో ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు మూడు కొత్త బస్సు మార్గాలు
- నన్ను అరెస్ట్ చేయొచ్చు..అయినా వెనక్కి తగ్గం: అభిజీత్ దీప్కే
- ఐదు వారాల్లో తొలిసారి వారాంతపు పతన దిశగా డాలర్
- ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్
- డిసెంబర్ 11-12 తేదీల్లో కెనడాలో ప్రధాని మోదీ పర్యటన
- ఉద్యోగుల పాస్‌పోర్టులు ఇవ్వకపోతే QR25,000 జరిమానా..!
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నేరుగా వెళ్లొచ్చు..!
- కువైట్‌లో తగ్గనున్న ఉష్ణోగ్రతలు..తేలికపాటి వర్షాలకు అవకాశం..!
- వృద్ధాప్యం, మెదడు వ్యాధులపై పరిశోధనకు సౌదీ అంతరిక్ష ప్రయోగం..!!
- 12 ఏళ్లకే నిత్య తమ్మనకు అంతర్జాతీయ పురస్కారం!







