కారం పొంగల్

- May 06, 2015 , by Maagulf
కారం పొంగల్

మనం పొంగల్ గురించి నేర్చుకున్నాం కదా.. ఇప్పుడు మరో రకమైన పొంగల్ తో మీ ముందుకు వచ్చాం... స్పైసి స్పైసి పొంగల్...'కారం పొంగల్'..

 

కావలసిన పదార్ధాలు:

  • పెసరపప్పు                - 1 కప్పు
  • బియ్యం                    - 1 కప్పు
  • పచ్చిమిర్చి                - 3 లేక 4
  • కరివేపాకు                  - కొద్దిగా
  • అల్లం తురుము           - 1 టేబుల్ స్పూను
  • మిరియాలు               - 1 టీ స్పూను
  • జీలకర్ర                      - 1 టేబుల్ స్పూను
  • ఇంగువ                     - చిటికెడు
  • నూనె                        - 2 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు                       - తగినంత
  • పాలు                       - 1 కప్పు
  • నీళ్ళు                       - 8 కప్పులు

 

చేయు విధానం:

  • ముందుగా బియ్యం మరియు పెసరపప్పు ని కడిగి పక్క పెట్టుకోండి.
  • ఒక ప్రెస్సర్ కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఇందులో మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము, ఇంగువ వేసి ఒక 2 నిముషాలు వేయించండి.
  • ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పు ని ఇందులో వేసి పెసరపప్పు పచ్చివాసన పోయే దాక వేయించండి.
  • కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసి మరి కాసేపు వేయించండి.
  • నీళ్ళు, ఉప్పు, పాలు వేసి కుక్కర్ మూత పెట్టేసి 2 కూతలు రానివ్వండి.
  • ప్రెస్సర్ అంతే పోయేదాకా ఉంచి, మూత తీసి బాగా కలిపి వడ్డిన్చుకోవటమే..
  • ఎంతో కారంగా ఉండే పొంగల్ రెడీ..!

------ ప్రవీణ, హైదరాబాద్...

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com