కారం పొంగల్
- May 06, 2015
మనం పొంగల్ గురించి నేర్చుకున్నాం కదా.. ఇప్పుడు మరో రకమైన పొంగల్ తో మీ ముందుకు వచ్చాం... స్పైసి స్పైసి పొంగల్...'కారం పొంగల్'..
కావలసిన పదార్ధాలు:
- పెసరపప్పు - 1 కప్పు
- బియ్యం - 1 కప్పు
- పచ్చిమిర్చి - 3 లేక 4
- కరివేపాకు - కొద్దిగా
- అల్లం తురుము - 1 టేబుల్ స్పూను
- మిరియాలు - 1 టీ స్పూను
- జీలకర్ర - 1 టేబుల్ స్పూను
- ఇంగువ - చిటికెడు
- నూనె - 2 టేబుల్ స్పూన్లు
- ఉప్పు - తగినంత
- పాలు - 1 కప్పు
- నీళ్ళు - 8 కప్పులు
చేయు విధానం:
- ముందుగా బియ్యం మరియు పెసరపప్పు ని కడిగి పక్క పెట్టుకోండి.
- ఒక ప్రెస్సర్ కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఇందులో మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తురుము, ఇంగువ వేసి ఒక 2 నిముషాలు వేయించండి.
- ఇప్పుడు కడిగి పెట్టుకున్న పెసరపప్పు ని ఇందులో వేసి పెసరపప్పు పచ్చివాసన పోయే దాక వేయించండి.
- కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసి మరి కాసేపు వేయించండి.
- నీళ్ళు, ఉప్పు, పాలు వేసి కుక్కర్ మూత పెట్టేసి 2 కూతలు రానివ్వండి.
- ప్రెస్సర్ అంతే పోయేదాకా ఉంచి, మూత తీసి బాగా కలిపి వడ్డిన్చుకోవటమే..
- ఎంతో కారంగా ఉండే పొంగల్ రెడీ..!
------ ప్రవీణ, హైదరాబాద్...
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







