కొత్త చట్టాలతో 'దుబాయ్‌' స్మార్ట్‌ సిటీకి ఊతం

- December 05, 2015 , by Maagulf
కొత్త చట్టాలతో 'దుబాయ్‌' స్మార్ట్‌ సిటీకి ఊతం


దుబాయ్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌కి ఊతమిచ్చేలా కొత్త చట్టాల్ని రూపొందించారు యూఏఈ వైఎస్‌ ప్రెసిడెంట్‌, ప్రైమ్‌ మినిస్టర్‌ షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రసీద్‌ అల్‌ మక్తౌమ్‌. పబ్లిక్‌, ప్రైవేట్‌ సెక్టార్ల మధ్య సంబంధాలు మెరుగుపడేందుకు ఈ చట్టాలు ఉపకరించనున్నాయి. రెండేళ్ళ క్రితం ప్రకటించిన షేక్‌ మహమ్మద్‌ విజన్‌లో బాగంగా, ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్మార్ట్‌ నగరాల్లో ఒకటిగా దుబాయ్‌కి మరింత కీర్తిని తీసుకురావడానికి ఉపకరించేలా చట్టాల్ని రూపొందించారు. దుబాయ్‌ని సరికొత్తగా మలచేందుకు వీలుగా చట్టబద్ధమైన ఆర్గనైజేషనల్‌ స్ట్రక్చర్‌ మరియు లీగల్‌ ఫ్రేమ్‌ వర్క్‌ని పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని ఈ సందర్భంగా షేక్‌ మహమ్మద్‌ చెప్పారు. దుబాయ్‌ స్మార్ట్‌ సిటీ ప్రాజెక్ట్‌ కోసం ఏర్పాటు చేయబడిన కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు దుబాయ్‌ క్రౌన్‌ ప్రిన్స్‌ మరియు దుబాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ షేక్‌ హమదాన్‌ బిన్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తౌమ్‌. షేక్‌ మహమ్మద్‌ అనౌన్స్‌ చేసిన కొత్త చట్టాల ఆధారంగా పలు కమిటీలకు చట్ట బద్ధత లభించింది. 


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com