ఫేస్బుక్ ద్వారా డెంటల్ ఆపరేషన్: ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
- April 30, 2018ఇద్దరు వ్యక్తులు ఓ అపార్ట్మెంట్లో డెంటల్ క్లినిక్‌ని అక్రమంగా నిర్వహిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సోషల్ మీడియా (ఫేస్బుక్) ద్వారా ప్రకటనలు ఇస్తూ, రోగుల్ని ఆకర్షించి, వారికి లైసెన్స్ లేని క్లినిక్‌లో దంత వైద్యం నిర్వహిస్తున్నారు నిందితులు. పోలీసులు ఈ నిందితుల్ని అరెస్ట్ చేయడం కోసం అండర్ కవర్ ఆపరేషన్ నిర్వహించారు. ఫేస్ బుక్ ద్వారా నిందితుల్ని కాంటాక్ట్ చేసి, వారిని రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి మెడికేషన్‌ని, ఇతర పరికరాల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అరెస్టు చేసినవారిలో ఒకరు అరబ్ అనీ, ఇంకొకరు యూరోపియన్ అనీ భావిస్తున్నారు. నిందితుల్ని తదుపరి విచారణ నిమిత్తం పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించారు.
తాజా వార్తలు
- ఏపీలో 9.05 శాతం..తెలంగాణలో 9.51 శాతంగా పోలింగ్ నమోదు
- సీబీఎస్ఈ క్లాస్ 10 ఫలితాలు విడుదల..
- ఏపిలో పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు..
- తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్
- దుబాయ్ బిజినెస్ బే నుండి మెట్రో స్టేషన్లకు నేరుగా బస్సులు
- KAPP డైరెక్టర్ తో భారత రాయబారి కీలక భేటీ..!
- దుబాయ్ లో సులువుగా 6 ఆన్-ది-గో పోలీసు సేవలు
- సౌదీలో మే మొదటి వారంలో 19,710 మంది అరెస్ట్
- ఓటు వేసిన చంద్రబాబు, జగన్
- మస్కట్ ఎక్స్‌ప్రెస్ వే మూసివేత