ఫ్రీ టికెట్స్‌: ఖండించిన కతార్‌ ఎయిర్‌ వేస్‌

- April 30, 2018 , by Maagulf
ఫ్రీ టికెట్స్‌: ఖండించిన కతార్‌ ఎయిర్‌ వేస్‌

దోహా: కువైట్‌లో పనిచేస్తున్న ఫిలిప్పీన్స్‌కి స్వదేశం వెళ్ళేందుకు ఉచిత టిక్కెట్లు అందిస్తున్నారంటూ వచ్చిన వార్తల్ని ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ ఖండించింది. ఖతార్‌ - కువైట్‌ మధ్య తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ కువైట్‌ నుంచి స్వదేశానికి వెళ్ళే ఫిలిప్పినోస్‌కి ఉచితంగా టిక్కెట్లను అందిస్తున్నట్లు సోషల్‌ మీడియా ద్వారా దుష్ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ ఖండించింది. కమర్షియల్‌ పాలసీ ప్రకారమే తమ సేవలు కొనసాగుతున్నాయనీ, అవసరమైన పత్రాలు వున్నవారెవరైనా టిక్కెట్లు కొనుక్కోవచ్చనీ, వాటిని తాము నియంత్రించలేమని ఖతార్‌ ఎయిర్‌ వేస్‌ పేర్కొంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com