పాతబస్తీలోని పోలీసులు నిషేధాజ్ఞలు...
- December 05, 2015
పాతబస్తీలోని అన్ని ప్రాంతాలలో పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఆదివారం (6వ తేదీ) ఉదయం నుంచి 7వ తేదీ సోమవారం ఉదయం వరకు ఆంక్షలు కొనసాగుతాయని దక్షిణ మండలం డీసీపీ వి.సత్యనారాయణ తెలిపారు. ఎప్పటిలాగే ప్రార్థనలు, పూజలు యథావిధిగా కొనసాగించుకోవచ్చన్నారు. బ్లాక్ డేను పురస్కరించుకొని పాతబస్తీలో 20 ప్లాట్లూన్ల పారా మిలటరీ దళాలు, 50 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, 150 మంది సబ్ ఇన్‌స్పెక్టర్లతో పాటు దక్షిణ మండలంలోని అన్ని పోలీస్‌స్టేషన్‌లకు చెందిన పోలీసు సిబ్బంది బందోబస్తులో పాల్గొంటారని చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణలో స్థానికులు తమతో సహకరించాలని ఆయన కోరారు. ర్యాలీలు నిర్వహించడానికి ఇప్పటి వరకు ఏ మత సంస్థకూ అనుమతి ఇవ్వలేదన్నారు.
తాజా వార్తలు
- విశాఖ–రాయపూర్ ఎక్స్ప్రెస్వే
- 'ఏక్తా యాత్ర' సర్దార్ పటేల్కు సముచిత నివాళి: వెంకయ్య నాయుడు
- న్యూజెర్సీలో NATS ఫుడ్ డ్రైవ్కు మంచి స్పందన
- 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు ఒడిశా గవర్నర్ హరిబాబు కు ఆహ్వానం
- నేవీ చీఫ్ హెచ్చరిక: ఘర్షణల కోసం సిద్ధం
- రెండు బస్సుల ఢీకొట్టు–11 మృతి, 40 గాయాలు
- టీమిండియా ఘన విజయం
- మచిలీపట్నం, విశాఖలో మైరా బే వ్యూ రిసార్ట్స్
- తెలంగాణలో మరో 4 విమానాశ్రయాలు: సీఎం రేవంత్
- ఏపీ పెన్షన్ పంపిణీ ప్రారంభం







