ఫేస్‌బుక్‌ ఎఫెక్ట్‌...-కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థ మూసివేత

ఫేస్‌బుక్‌ ఎఫెక్ట్‌...-కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థ మూసివేత

లండన్‌: ఫేస్‌బుక్‌ను వివాదాంశంగా మార్చిన కేంబ్రిడ్జి అనలిటికా కన్సెల్టెన్సీ సంస్థను మూసివేస్తున్నట్లు బుధవారం అధికారులు వెల్లడించారు. అమెరికా, బ్రిటన్‌లలో వారి కంపెనీ దివాలా తీసినట్లు ప్రకటించారు. ఫేస్‌బుక్‌ వివాదం కారణంగా తాము వినియోగదారులను కోల్పోయామని, ఇక మీదట కంపెనీని కొనసాగించలేమని వెల్లడించారు. అయితే కేంబ్రిడ్జి అనలిటికాను మూసేసినా ఫేస్‌బుక్‌ వివాదం నేపథ్యంలో దానిపై దర్యాప్తు కొనసాగుతుందని బ్రిటన్‌ డేటా రెగ్యులేటర్‌ వెల్లడించింది. కేంబ్రిడ్జి అనలిటికా, దాని మాతృసంస్థకు సంబంధించిన అన్ని విషయాలపైనా దర్యాప్తు చేస్తామని, కంపెనీ మూసివేత ప్రకటనపైనా పరిశీలిస్తున్నామని ఇన్ఫర్మేషన్‌ కమిషనర్‌ కార్యాలయం(ఐసీఓ) అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఐసీఓ సివిల్‌, క్రిమినల్‌ దర్యాప్తు కొనసాగిస్తుందని స్పష్టంచేశారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ వెల్లడించింది.

Back to Top