డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి రిపోర్ట్‌

డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి రిపోర్ట్‌

బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌ డిప్యూటీ కలెక్టర్‌గా సొంత జిల్లా గుంటూరు కలెక్టరేట్‌లో రిపోర్ట్‌ చేశాడు. నిన్న సాయంత్రం గుంటూరు కలెక్టర్‌ కోన శశిధర్‌కు తన నియామక పత్రాన్ని అందజేశాడు. డిప్యూటీ కలెక్టర్‌గా 72 వారాల శిక్షణను కూడా సొంత జిల్లా గుంటూరులోనే పూర్తిచేసేలా అనుమతిచ్చినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాడు. ఈ సమయంలో శ్రీకాంత్‌తో పాటు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు రంగారావు ఉన్నాడు. ఇదివరకే ఏపీ ముఖ్యమంత్రి నివాసంలో.. శ్రీకాంత్‌కు సీఎం చంద్రబాబు డిప్యూటీ కలెక్టర్‌ పోస్టింగ్‌ ఉత్తర్వులను అందించిన విషయం తెలిసిందే.

Back to Top