బ్యాంకాక్ :కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి
- May 04, 2018
బ్యాంకాక్ : గనుల తవ్వకాలు జరిగిన ప్రాంతంలో పైభాగంలో ఉన్న కొండచరియలు విరిగిపడి 14 మంది మృతి చెందారు. ఆరుగురికి గాయాలయ్యాయి. మరికొంతమంది మిస్ అయ్యారు. అదృశ్యమైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. గాయాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. ఉత్తర మయన్మార్‌లోని జేడ్ మైనింగ్ ప్రాంతంలో ఈ ఘటనలో చోటుచేసుకుంది. జేడ్ మైనింగ్ స్థలంలో ప్రతీ రోజు భారీ యంత్రాలతో తవ్వకాలు కొనసాగుతుంటాయి. తవ్వకాల్లో మిగులు మట్టి, రాళ్ల సంబంధిత వ్యర్థాలు పెద్ద మొత్తంలో కుప్పకుప్పలుగా పేరుకుపోతాయి. దీనివల్ల కొంచచరియలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2015లో ఇదే ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..