సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి'

- May 04, 2018 , by Maagulf
సెన్సార్ పూర్తి చేసుకున్న 'మహానటి'

నాగ అశ్విన్ డైరెక్షన్‌లో కీర్తి సురేష్ లీడ్ రోల్ పోషించిన సినిమా మహానటి. ఎవర్ గ్రీన్ అందాల నటి సావిత్రి జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్.. జెమినీ గణేశన్ పాత్రలో నటిస్తున్నాడు. సమంత, విజయ్ దేవరకొండ, మోహన్‌బాబు తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. చాలా రోజుల క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌పై దృష్టి సారించింది.

తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ సినిమాకు క్లీన్ 'యు' సర్టిఫికెట్ జారీ చేశారు. సినిమా ప్రారంభం నుంచే ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. సినిమాపై భారీ బజ్ నెలకొంది. సావిత్రి జీవిత కథను తెలుసుకునేందుకు ఈ సినిమా కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com