మల్లెపూల వలన లాభాలు...

- May 10, 2018 , by Maagulf
మల్లెపూల వలన లాభాలు...

మండు వేసవిలో సాయంకాలాల్లో ఇంటికి సువాసనలిచ్చే మల్లెపూల గురించి, మహిళల జడల్లో తళ తళ మెరిసి పోయే మల్లెల గురించి పరిచయం చేయాల్సినపనిలేదు కదా.. చల్లదనానికి, కమ్మదనానికి, సౌందర్య వికాసానికి, మరులు గొలిపే గుబాళింపులకు మారుపేరైన మల్లెపూలు ఔషధంలాగా, సౌందర్య సాధనంగా కూడా ఉపయోగ పడుతుందంటే ఆశ్చర్యపోవటం దేనికి... అందుకే మల్లెలు మనకు అందించే ఇతర ప్రయోజనాలను చూద్దాం.

రోజంతా శారీరక కష్టంతో అలసి పోయిన శరీరాన్ని సేదతీర్చి, మనసంతా ఆహ్లాదాన్ని నింపి, మధురాను భూతులను పంచే మల్లెల గుబాళింపుల నడుమ హాయిగా కునుకు పట్టేస్తుంది. ప్రతిరోజూ మల్లెపూలను తలలో పెట్టుకోవటం వల్ల ఆహ్లాదంగా వుండడమే కాదు, కళ్లకూ మేలు చేస్తాయి. అలసిన కనురెప్పలపై మల్లెలను కొద్దిసేపు పరిచి వుంచితే చలవ చేస్తాయి. బాగా నిద్రపడుతుంది. పరిమళ భరిత మల్లెపూవుల్ని ఎన్నో సుగంధ సాధనాల తయారీలో ఉపయోగిస్తున్నారు.
 
సబ్బులు, తలనూనెలు, సౌందర్య సాధనాలు, అగరు బత్తీల తయారీల్లో మల్లెపూలను ఉపయోగిస్తారు. సెంట్లు, ఫర్‌ఫ్యూమ్‌లలో అయితే మల్లెపూలను విరివిగా ఉపయోగిస్తారు. తలలో చుండ్రు సమస్య అధికంగా వుంటే మెంతులలో కాసిన్ని ఎండు మల్లెపూలు కలిపి నూరి తయారైన… పూతను తలకు పట్టిస్తే మంచిది. జుట్టుకూడా పట్టుకుచ్చులా మెరిసిపోతుంది. 
 
కొబ్బరి నూనెలో మల్లెపూలు వేసి ఓ రాత్రంతా బాగా నాననిచ్చి, మరిగే వరకూ కాచి వడగట్టి వాడితే తల సువాసన భరితం కావడమే కాకుండా క్లేశాలకు మంచి పోషణ అవుతుంది. మాడుకు మేలు చేస్తుంది. మల్లెల్ని సేఫ్‌ ప్యాక్‌గా కూడా వాడుకోవచ్చు. మల్లెల్ని పేస్టుగా చేసి, కొద్దిగా పచ్చిపాలు కలిపి, నె మ్మదిగా మసాజ్‌ చేసుకోవాలి. తర్వాత ముల్తానా మట్టి, గంధం, తేనె అరస్పూన్‌ చొప్పున కలిపి ప్యాక్‌ వేసుకోవాలి. 
 
మల్లెపూల రసం తీసి గులాబీ పువు్వల రసం, గుడ్డులోని పచ్చసొన రెండేసి స్పూన్ల చొప్పున కలిపి ముఖానికి రాస్తే ముఖం మృదువుగా, కాంతివతంగా మెరిసిపోతుంది. చర్మానికి అవసరమయ్యే సి విటమిన్‌ మల్లెల్లో విరివిగా వుంటుంది. అందుకే మల్లె తూడులను అన్నంలో కలిపి తినటం కూడా గ్రామీణ జీవితంలో కనపడుతుంది. మల్లెల్లో ఈ మంచి గుణాలు అన్నీ వున్నాయి కనుకే తెల్లని తెలుపులో, సుగంధ పరిమళాలలోమరేపుప్వూ దీనికి సాటిరాదంటే అతిశయోక్తి కాదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
   

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com