బాదామి హరియాలి
- May 10, 2018
కావలసిన పదార్థాలు: ఉల్లికాడలు - 5, పచ్చిమిర్చి - 4, బాదం తరగు - అరకప్పు, అల్లం తరుగు - 2 టీ స్పూన్లు, కొత్తిమీర తరుగు - ముప్పావు కప్పు, మెంతి ఆకులు - అరకప్పు, ఉడికించిన బీన్స్ - 1 కప్పు, పచ్చిబఠాణి - 1 కప్పు, తాజా క్రీమ్ - 2 టేబుల్ స్పూన్లు, పంచదార - 2 టీ స్పూన్లు, జీలకర్ర పొడి - 1 టీ స్పూను, బిర్యాని ఆకు - 1, నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు - రుచికి తగినంత, పనీర్ తురుము - అలంకరణకు.
తయారుచేసే విధానం: బాదం తరుగుతో పాటు ఉల్లి కాడలు (తెల్లని భాగం మాత్రమే), కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు మిక్సీలో వేసి కొద్దిగా నీరు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. నూనెలో బిర్యాని ఆకుతో పాటు బాదం పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకు చిన్నమంటపై వేగించాలి. ఇప్పుడు మెంతి ఆకులు, పచ్చిబఠాణి, ఉప్పు, పంచదార, జీలకర్ర పొడి కలిపి 8 నిమిషాల ఉంచాలి. తర్వాత ఉడికించిన బీన్స్, క్రీమ్ వేసి 3 నిమిషాలు తర్వాత పనీర్ తురుము చల్లి దించెయ్యాలి. నాన్, పరాటాలతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన రోనాల్డో
- త్వరలో 190 కొత్త అంబులెన్స్లు ప్రారంభం: మంత్రి సత్యకుమార్
- సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్టు..!!
- యూఏఈ గోల్డెన్ వీసా హోల్డర్లకు కాన్సులర్ సేవలు..!!
- ప్రైవేట్ రంగంలో విదేశీ కార్మికుల నియామకంపై నిషేధం..!!
- సిద్రా మెడిసిన్లో ‘హీలింగ్ నోట్స్’ ప్రారంభం..!!
- SR21 మిలియన్ల విలువైన 39వేల రిజిస్ట్రేషన్లు రద్దు..!!
- సహామ్లో 7వేల సైకోట్రోపిక్ పిల్స్ స్వాధీనం..!!
- Android 16 ఆధారిత కొత్త అప్డేట్ వివరాలు
- విలువైన బిట్కాయిన్ సీజ్ చేసిన అమెరికా