రమదాన్: పిలిగ్రిమ్స్ కోసం ఎమర్జన్సీ టీమ్స్
- May 10, 2018
మక్కా: అత్యవసర పరిస్థితుల్లో ఉమ్రా పిలిగ్రిమ్స్ అలాగే విజిటర్స్‌కి గ్రాండ్ మాస్క్ వద్ద సేవలందించేందుకోసం రమదాన్ పవిత్ర మాసంలో ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేశారు. మక్కా డిప్యూటీ ఎమిర్, ప్రిన్స్ అబ్దుల్లా బిన్ బందర్ ఈ మేరకు ఓ డైరెక్టివ్‌ని విడుదల చేశారు. అబ్దుల్లా బిన్ బందర్, సెంట్రల్ హజ్ కమిటీకి డిప్యూటీ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెల్సిందే. ప్రిన్స్ అబ్దుల్లా, గ్రాండ్ మాస్క్‌ని సందర్శించి, అక్కడ ఏర్పాట్లను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. సెక్యూరిటీ ఫోర్సెస్‌ని అడిగి సమాచారాన్ని సేకరించిన ప్రిన్స్, భద్రత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని వారికి సూచించారు. రమదాన్ సందర్భంగా పెద్దయెత్తున యాత్రీకులు గ్రాండ్ మాస్క్‌కి వచ్చే అవకాశం వున్నందున, ఎలాంటి అనుకోని ఘటనలకూ తావివ్వకూడదని ఆదేశించారు ప్రిన్స్.
తాజా వార్తలు
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!







