హలీం విక్రయించే హోటళ్లకు మార్గదర్శకాలను విడుదల చేసిన మేయర్
- May 11, 2018
హైదరాబాద్ : హలీం తయారీలో ప్రమాణాలు పాటించి ప్రజల ఆరోగ్యం పాడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మేయర్ బొంతు రామ్మోహన్ హోటల్ నిర్వాహకులకు విజ్ఙప్తి చేశారు. నాణ్యమైన వస్తువులను మాత్రమే వినియోగించాలని, శుభ్రతను పాటించాలని, ప్రమాదాలకు లేకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసిన మేయర్ వాటిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మేయర్ రామ్మోహన్ హోటల్ నిర్వాహకులతో జీహెచ్‌ఎంసీ కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ సందర్భంగా 40 రోజులపాటు నగరంలో భారీగా హలీం విక్రయాలు సాగుతాయని, ఈ సందర్భంగా ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా హోటళ్ల నిర్వాహకులు తగిన జాగ్రత్త చర్యలు పాటించాలని కోరారు. ఉత్తమ హోటళ్లకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు, నిబంధనలు ఉల్లంఘిచే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. డిప్యూటీ మేయర్ బాబాఫసియుద్దీన్‌తోపాటు పలువురు అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. * హలీం బట్టీలను గ్రౌండ్‌ఫ్లోర్‌లో మాత్రమే ఏర్పాటు చేయాలి. * హలీం విక్రయశాలల వద్ద హోటల్ యజమానులు తగినంత పార్కింగ్ సౌకర్యం కల్పించాలి.
* 50 మైక్రాన్లకన్నా తక్కువ మందం గల ప్లాస్టిక్‌ను ఉపయోగించరాదు. * మాంసాన్ని జీహెచ్‌ఎంసీకి చెందిన కబేళాల నుంచే సేకరించాలి. అక్రమ జంతువధ నిషేధం. * హోటళ్లలో తగిన శుభ్రతను పాటించాలి.
* ఫుట్‌పాత్‌లు, బహిరంగ ప్రదేశాలు ఆక్రమించరాదు. * ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయాలి. * ప్రజా భద్రత, అగ్నిమాపక చర్యలు తప్పనిసరిగా పాటించాలి. ఇది హోటల్ నిర్వాహకుల బాధ్యత.
* వ్యర్థాలను రోడ్డుపై పారవేయరాదు. చెత్త కుండీల్లో మాత్రమే వేయాలి. * తడి, పొడి వ్యర్థాలను విడివిడిగా ఉంచి బల్దియా సిబ్బందికి అందించాలి.
తాజా వార్తలు
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్‌లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్‌లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్‌లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?







