భారీ ఆఫర్ పట్టేసిన చెర్రీ!
- May 12, 2018
రంగస్థలం సినిమాతో భారీ హిట్ ను అందుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్నారు. మాస్ కంటెంట్ స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న బోయపాటి ఈ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కిస్తాడోనన్న సినీవర్గాల్లో నెలకొంది. ఇదిలావుంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో బోయపాటి చేసిన సరైనోడు సినిమా కమర్షియల్ గా మంచి హిట్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాను హిందీలో డబ్బింగ్ చేసి ఆన్ లైన్ లో విడుదల చేసిన ఈ సినిమాను సుమారు 16 కోట్ల మంది వీక్షించారు. ఈ క్రమంలో తాజాగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామ్ చరణ్ సినిమాకు భారీ క్రేజ్ ఏర్పడింది. ఈ సినిమా హిందీ హక్కులను దాదాపు రూ.21 కోట్లకు కొనుకున్నట్టు ఫిలింనగర్లో వార్త హల్చల్ చేస్తోంది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తున్న ఈసినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రముఖ పాత్రలో కనిపించనున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







