మైండ్ బ్లాంక్:మాజీ ప్రధాని ఇంట్లో కేజీల కొద్దీ బంగారం,పెట్టెల నిండా డబ్బు

- May 14, 2018 , by Maagulf
మైండ్ బ్లాంక్:మాజీ ప్రధాని ఇంట్లో కేజీల కొద్దీ బంగారం,పెట్టెల నిండా డబ్బు

కేజీల కొద్దీ బంగారం, ప్లాటినం ఆభరణాలు.. అట్ట పెట్టెల నిండా డబ్బు, మలేసియాతోపాటు అమెరికన్, ఇతర దేశాల నగదు.. ఇవన్నీ ఎక్కడో కాదు.. సాక్షాత్తూ మాజీ ప్రధాని నివాసంలో బయటపడ్డాయి. మొన్నటి వరకు మలేసియా ప్రధానిగా ఉన్న నజీబ్ రజాక్ ఇంట్లో పోలీసులు సోదాలు చేయగా మైండ్ బ్లాంక్ అయ్యేంత స్థాయిలో డబ్బు బయటపడింది. 

మలేషియా మాజీ ప్రధాని నజీబ్‌ రజాక్‌ ఇంట్లో భారీగా నగదు, ఆభరణాలను పోలీసులు గుర్తించారు. నిన్న పోలీసులు నిర్వహించిన సోదాల్లో ఊహకందని విధంగా భారీ నోట్ల కట్టలు లభించాయి. వాటితో పాటు ప్లాటినం, డైమండ్స్‌, ఇతర ఆభరణాలను  కూడా భారీగా గుర్తించారు. 

మరోవైపు ఇటీవల ఎన్నికల్లో ఓటమిపాలై, ప్రధాని పదవిని కోల్పోయిన నజీబ్‌పై నూతన ప్రధాని మహతీర్‌ మొహ్మద్‌ పలు ఆంక్షలు విధించారు. నజీబ్‌ దేశం విడిచివెళ్లొదంటూ ఉత్తర్వులు జారీ చేశారు. వేల కోట్ల డాలర్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నజీబ్‌ ప్రాసిక్యూషన్‌ నుంచి తప్పించుకునేందుకు దేశాన్ని విడిచి వెళ్లిపోతున్నట్టు ఊహాగానాల నేపథ్యంలో ఇమ్మిగ్రేషన్‌ విభాగం ఈ ప్రకటన చేసింది.

వేల కోట్ల డాలర్ల కుంభకోణం ఆరోపణల్లో భాగంగా అతడి ఇళ్లపై సోదాలు చేయమని ఆదేశించారు కొత్త ప్రధాని మహతీర్‌ బిన్‌ మహ్మద్‌. అవినీతికి పాలపడ్డవారెంతటి వారైనా ఉపేక్షించబోమని ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే ప్రకటించిన మహతీర్‌..  ఆ వెంటనే ఇలా మాజీ ప్రధాని ఇళ్లపై సోదాలకు ఆదేశించారు.. ఇందులో భాంగా నజీబ్‌ రజాక్  ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు.. అక్కడ దొరికిన నగదు చూసి షాక్‌ అయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com