అమెరికాలో కామారెడ్డి జిల్లా వాసి మృతి
- May 14, 2018
డల్లాస్: అమెరికాలోని ఉత్తర టెక్సాస్‌లో జరిగిన ప్రమాదంలో తెలంగాణాలోని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి మరణించాడు.
కుటుంబసభ్యులతో కలిసి శనివారం నాడు గ్రేప్‌వైన్ సరస్సులో బోటింగ్ చేయడానికి వెళ్ళిన వెంకట్రామిరెడ్డి మరణించాడు. పొంటూన్ బోటు నుండి ఈత కొట్టేందుకు నీళ్ళలోకి దూకిన ఆయన ఎంతకీ పైకి రాకపోవడంతో రెస్క్యూ సిబ్బందికి సమాచారమిచ్చారు. 24 గంటల తర్వాత వెంకట్రామిరెడ్డి మృతదేహం సరస్సులో దొరికింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఈ బోటులో సుమారు 12 మంది ఉన్నారు. వెంకట్రామిరెడ్డి డల్లాస్ లోని గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రోఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన భార్య వాణి కూడ ఉద్యోగిని. ఈ విషయాన్ని వెంకట్రామిరెడ్డి కుటుంబసభ్యులకు సమాచారమిచ్చారు.
ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆదివారం అదే సరస్సులో జరిగిన మరో ప్రమాదంలో సరస్సులో మునిగిపోయిన ఓ 25 ఏళ్ల యువకుడిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అతడిని బెయిలర్ స్కాట్ అండ్ వైట్ మెడికల్ సెంటర్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ రెండు ఘటనల్లో బాధితులు లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని గ్రేప్ వైన్ ఫైర్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ చీఫ్ జాన్ షేర్వుడ్ తెలిపారు.
తాజా వార్తలు
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!







