2 బస్సుల ఢీ: 32 మందికి గాయాలు

- May 14, 2018 , by Maagulf
2 బస్సుల ఢీ: 32 మందికి గాయాలు

అబుదాబీలో జరిగిన ఓ రోడ్డు మ్రాదంలో 32 మంది గాయాల పాలయ్యారు. పెప్సికోలా ఇంటర్‌సెక్షన్‌ వద్ద రెండు బస్సులు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బస్సు డ్రైవర్‌ రెడ్‌ సిగ్నల్‌ని జంప్‌ చేయడమే ఈ రోడ్డు ప్రమాదానికి కారణంగా అనుమానిస్తున్నారు. ఆపరేషన్స్‌ రూమ్‌కి సాయంత్రం 4.35 నిమిషాల సమయంలో సమాచారం అందడంతో, వెంటనే పోలీస్‌ పెట్రోల్స్‌, అంబులెన్స్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు అబుదాబీ పోలీస్‌ - ట్రాఫిక్‌ అండ్‌ పెట్రోల్స్‌ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ ఖలీఫా మొహమ్మద్‌ అల్‌ ఖయిల్‌ చెప్పారు. 31 మందికి ఓ మోస్తరు గాయాలయ్యాయనీ, ఒకరికి తీవ్ర గాయాలయ్యాయనీ, గాయపడ్డవారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారాయన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com