హైదరాబాద్‌కు మారిన కన్నడ రాజకీయాలు..
- May 17, 2018
బెంగళూరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలంతా హైదరాబాద్ చేరబోతున్నారు. కర్నాటకలో బలపరీక్షకు తేదీ ఫిక్స్ అయ్యే వరకూ కూడా వీరంతా హైదరాబాద్‌లోనే బస చేస్తారు. ముందుగా కర్నాటక క్యాంప్‌ను కొచ్చీకి మారుద్దామనుకున్నా ఆఖర్లో ప్లాన్ మార్చారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతకు చెందిన హోటల్లో వీరి క్యాంప్ ఏర్పాటు చేశారు. అటు, కొందరిని గోల్కొండ రిసార్ట్‌కు తరలిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. అలాగే కొందరికి తాజ్ కృష్ణాలో బస ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.
బెంగళూరు నుంచి ఎమ్మెల్యేల్ని తీసుకురావడం కూడా చాలా పక్కాగా ప్లాన్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతకు చెందిన శర్మ ట్రావెల్స్‌లోనే వీళ్లను బస్సుల్లో హైదరాబాద్ తీసుకొచ్చారు. బీజేపీ తమ ఎమ్మెల్యేల్ని ప్రలోభపెడుతున్న నేపథ్యంలో.. వాటిని తట్టుకుని నిలబడాలంటే హైదరాబాదే బెస్ట్ అని భావించి అందరినీ ఇక్కడికి తీసుకొచ్చారు. బెంగళూరు నేతలు హైదరాబాద్ వస్తున్నారన్న సమాచారం రాగానే.. తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా యాక్షన్‌లోకి దిగిపోయారు. నేతలకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు వారంతా పార్క్ హయత్‌కు చేరుకుంటున్నారు.
ముందుగా ప్రజాప్రతినిధులందరినీ కొచ్చి తీసుకెళ్లాలని భావించారు. ఈగల్డన్ రిసార్టులో ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోపాటు, షాంగ్రిలా రిసార్టులో ఉన్న జేడీఎస్ ఎమ్మెల్యేలకు అక్కడ ఓ రిసార్టులో 100 రూమ్‌లు కూడా బుక్ చేశారు. 3 ఫ్లైట్లలో అందరినీ తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో ఊహించని షాక్ తగిలింది. ముందస్తు పర్మిషన్ లేదన్న కారణంగా ATC నుంచి ఫ్లైట్స్ టేకాఫ్ అయ్యేందుకు క్లియరెన్స్ రాలేదు. హైడ్రామా తర్వాత చివరికి కాంగ్రెస్-JDS సభ్యులంతా బస్సుల్లో హైదరాబాద్ వచ్చారు.
తాజా వార్తలు
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- మరో మలేసియా విమానం మిస్సింగ్ 11 మంది పై ఉత్కంఠ!







