బేసిల్ చికెన్
- May 17, 2018
కావలసినవి: క్యాప్సికమ్ - రెండు, తులసాకులు(గుజ్జు) - 10 గ్రాములు, ఉల్లికాడలు - 20 గ్రాములు, అల్లం - నాలుగు గ్రాములు, గుడ్డు - ఒకటి, ఉప్పు - రుచికి సరిపడా, మిర్చి గుజ్జు - 20 గ్రాములు, మైదా - 50 గ్రాములు, నూనె - వంద మిల్లిలీటర్లు, ఆయిస్టర్ సాస్, కొత్తిమీర - ఒక్కోటి 20 గ్రాముల చొప్పున, వెల్లుల్లి - 10 గ్రాములు, చికెన్ (బోన్‌లెస్) - 200 గ్రాములు. అలంకరించేందుకు మరికొన్ని తులసాకులు తీసుకోవాలి.
తయారీ: చికెన్‌ను శుభ్రంగా కడిగి ముక్కలు కోయాలి. కూరగాయల్ని కూడా కడిగి ముక్కలు కోయాలి. మైదాపిండిలో ఉప్పు వేసి గుడ్డు సొన కలిపి పిండి ముద్ద చేయాలి. చికెన్ ముక్కల్ని ఆ పిండిలో ముంచి వేగించాలి. ఒక పాన్‌లో నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి, కొత్తిమీర, ఆయిస్టర్ సాస్, మిర్చి గుజ్జు వేసి ఓ మాదిరి మంట మీద వేడిచేయాలి. తరువాత వేగించిన చికెన్ ముక్కలు, తులసాకుల గుజ్జు వేసి కలపాలి. తులసాకులతో అలకంరించాలి.
తాజా వార్తలు
- యూఏఈలో ఆన్లైన్ ట్రేడింగ్ స్కామ్‌లకు బలవుతున్న ఇన్వెస్టర్లు..!!
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. తీవ్రంగా ఖండించిన ఒమన్..!!
- సార్ కారు ప్రమాదం.. మూడుకు చెరిన మృతుల సంఖ్య..!!
- స్పెషల్ ఆపరేషన్.. ఖైతాన్‌లో 20 మంది ప్రవాసులు అరెస్టు..!!
- యూఏఈ ఉద్దేశపూర్వకంగా 3 నౌకలను ఎందుకు ముంచివేసిందంటే..!!
- సౌదీ అరేబియాలో 2,400 మందికి పైగా స్మగ్లర్లు అరెస్టు..!!
- ఈ కార్ రేసు కేసులో కెటిఆర్ కు ఎసిబి పిలుపు
- మొబైల్ వినియోగదారులకి టెలికాం శాఖ గుడ్ న్యూస్
- హైదరాబాద్ లో రెచ్చిపోతున్న రాజస్థాన్ దొంగలు
- ఇరాన్‌పై ఇజ్రాయెల్ వార్..ముడి చమురు ధరలకు రెక్కలు!