వేసవిలో అతిదాహాన్ని కట్టడి చేసే నేరేడు..
- May 18, 2018వేసవి కాలంలో అతిదాహాన్ని కట్టడి చేసే గుణాలు నేరేడు పండ్లలో వున్నాయి. వేసవిలో నేరేడు పండ్లు తీసుకోవండం ద్వారా శరీరానికి చలువనిస్తుంది. మూత్రాశయ రుగ్మతలను నేరేడు పండ్లు నయం చేస్తాయి. కిడ్నిల్లో రాళ్లు ఏర్పడకుండా చూస్తాయి.
కడుపులోనులి పురుగులను నివారిస్తుంది. నోటి, మూత్రాశయ క్యాన్సర్‌కు టానిక్‌లా పని చేస్తుంది. కడుపులో ప్రమాదవశాత్తు చేరుకున్న తల వెంట్రుకలను సైతం నేరేడు కరిగిస్తుంది. నేరేడు రసంలో కొంచెం చెక్కర కలిపి తాగితే ఉదర సంబంధిత రుగ్మతలు తొలగిపోతాయి.
విత్తనాలు ఎండబెట్టి చేసిన చూర్ణం తీసుకుంటే అతి మూత్రవ్యాధి అదుపులోకి వస్తుంది. నేరేడు పుల్లతో పండ్లు తోముకుంటే చిగుళ్ళు ఆరోగ్యంగా ఉంటాయి. చిగుళ్ళు నుంచి రక్తస్రావం తగ్తుతుంది. నోటి దుర్వాసన దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
నేరేడుపండ్లలో కాల్షియం, మెగ్నీషియం, పాస్ఫరస్, సోడియం, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా లభిస్తాయి. నేరేడు పండ్లను తీసుకుంటే మధుమేహ వ్యాధి నియంత్రణ, రక్తహీనత తగ్గుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పండ్లు మధుమేహ వ్యాధిగ్రస్తులు తీసుకుంటే రక్తంలో చక్కెరస్థాయి అదుపులోకి వస్తుంది.
రక్తహీనత సమస్య ఎదుర్కొంటున్న వారు వీటని తీసుకుంటే శరీరానికి మంచిది. జీర్ణక్రియ మెరుగవ్వాలంటే.. కప్పు పెరుగులో నాలుగు చెంచాల నేరేడు పండ్ల రసం కలిపి తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- షార్ట్స్‌లో వీడియోల నిడివిని పెంచిన యూట్యూబ్
- కాంగో పడవ ప్రమాదంలో 78 మంది జల సమాధి
- రేపటి నుంచి భారత్–బంగ్లా టీ20 టిక్కెట్ల విక్రయం
- తిరుమల తిరుపతి శ్రీవారికి చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు
- ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య వైరం ఏమిటి? ఎందుకు?
- ఇండియాకు పన్నెండు ఐఫోన్ 16 తీసుకొస్తూ.. పట్టుబడ్డ ప్రయాణికులు..!!
- అబుదాబిలో వేటాడుతూ.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ వేటగాళ్లు..!!
- సౌదీ అరేబియాలో ఇన్‌బౌండ్ విజిటర్స్ వ్యయంలో 8.2% వృద్ధి..!!
- GCC-IMF సమావేశం.. ‘ఎకనామిక్స్ ఛాలెంజెస్’పై కీలక సమీక్ష..
- ఎక్స్పో సిటీ దుబాయ్.. మాస్టర్ ప్లాన్‌కు షేక్ మహమ్మద్ ఆమోదం..!!