బిగ్ బాస్ హోస్ట్ గా 'నాని' కంఫర్మ్!
- May 18, 2018
గతేడాది తెలుగులో ప్రారంభమైన బిగ్ బాస్ షోకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. 2017లో ప్రసారమైన అతిపెద్ద తెలుగు టీవీ షో లలో ఒకటిగా బిగ్ బాస్ నిలిచింది. దీనికి కారణం యుంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించడమే అనే అభిప్రాయముంది.. బిజీ షెడ్యూల్ కారణంగా ఎన్టీఆర్ ఈ షో నుంచి బయటకు వెళ్తున్నాడు. దీంతో అయన స్థానంలో నాచురల్ స్టార్ నాని బిగ్ బాస్ 2 కు హోస్ట్ గా ఫిక్స్ అయినట్టు సమాచారం.మొదటి సీజన్ లో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం.. అది సూపర్ హిట్ కావడంతో మళ్ళీ ఎన్టీఆరే సెకండ్ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తారని అనుకున్నారు.. కానీ సినిమాలతో బిజీగా ఉండడంతో బిగ్ బాస్ 2 నుంచి ఎన్టీఆర్ తప్పుకున్నాడు. ఇక అయన స్థానంలో మరో హీరో ఎవరైతే బాగుంటుందని ఆలోచించగా పలువురు పేర్లు తెరమీదకు వచ్చాయి. చివరగా నాని ఆ ఛాన్స్ కొట్టేశాడు. దీంతో ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బిగ్ బాస్ 2 తో బుల్లితెర ప్రేక్షకులను పలకరించనున్నాడు నాని.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







