బీరకాయ కోడిగుడ్డు కూర
- May 18, 2018
కావలసినవి:కోడిగుడ్లు(ఉడికించి. ఫోర్క్‌తో అక్కడక్కడా గాట్లు పెట్టాలి)- నాలుగు, ఉల్లి తరుగు-ముప్పావుకప్పు, లేత బీరకాయ ముక్కలు-రెండు కప్పులు, కరివేపాకు రెమ్మ-ఒకటి, పచ్చిమిర్చి నిలువుగా చీల్చి-ఒకటి, ఆవాలు-పావు టీస్పూన్, జీలకర్ర-అర టీస్పూన్, అల్లంవెల్లుల్లి పేస్ట్-ఒక టీస్పూన్, పసుపు-కొంచెం, ఉప్పు- రుచికి సరిపడా, కారం, గరం మసాలా పొడి-ఒక్కో టీస్పూన్ చొప్పున, నూనె- రెండు టేబుల్ స్పూన్లు.
తయారీ: పాన్‌లో నూనె వేడి చేసి కరివేపాకులు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేగించాలి. అవి చిటపటమంటున్నప్పుడు ఉల్లి తరుగు వేసి ఉప్పు చల్లి ఉల్లి ముక్కలు రంగుమారేవరకు ఉంచాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకు వేగించాలి. ఇందులో గుడ్లు వేసి రెండు నిమిషాలు వేగించి తీసి పక్కన పెట్టాలి. తరువాత బీరకాయ ముక్కలు వేసి ఉప్పు, పసుపు వేయాలి. మంట పెంచి మూడు నిమిషాలు వేగించాలి. మూతపెట్టి సన్నటి మంట మీద బీరకాయ ముక్కల్ని ఉడికించాలి. అవసరమనిపిస్తే కొన్ని నీళ్లు కలపాలి. కొన్ని బీరకాయల్లో నీళ్లు సరిగా ఉండవు అలాంటప్పుడు కాస్త ఎక్కువ నీళ్లు పట్టే అవకాశం ఉంది. ఇందులో వేగించిన గుడ్లు, కారం, మసాలాలు వేసి బాగా కలిపి సన్నటి మంట మీద ఏడు నిమిషాలు ఉంచాలి.
తాజా వార్తలు
- ఇరాన్ దాడుల అనంతరం కతార్లో ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- ఎయిర్ ఇండియా మిడిల్ ఈస్ట్ విమానాలను నిలిపివేత
- నివాసితులను అప్రమత్తంగా ఉండాలని కోరిన దుబాయ్ సెక్యూరిటీ సర్వీస్
- కతార్ పై మిసైల్ దాడిని తీవ్రంగా ఖండించిన GCC ప్రధాన కార్యదర్శి
- బహ్రెయిన్ వైమానిక పరిధిని తాత్కాలికంగా నిలిపివేత
- కువైట్ తాత్కాలికంగా వైమానిక పరిధి మూసివేత
- శ్రీవారి లడ్డూ ప్రసాదం కొనుగోలుకు నూతన సదుపాయం
- ఆర్టీసీ సిబ్బందిపై దాడులకు పాల్పడితే చట్టపరమైన చర్యలు: ఎండీ వీసీ సజ్జనర్
- భారత్కి క్రూడాయిల్ విషయంలో ఇబ్బంది లేదు: హర్దీప్ సింగ్
- చెన్నై పోలీసుల అదుపులో హీరో శ్రీరామ్..