అమెరికా స్కూల్‌లో కాల్పులు...
- May 18, 2018
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. టెక్సాస్‌లో ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ దారుణ ఘటనలో 10 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. శాంటా హైస్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాల్పులకు తెగబడిన దుండగుడిని అరెస్టు చేసినట్టు తెలుస్తోంది. శాంటా హైస్కూల్‌లోకి చొరబడ్డ ఓ వ్యక్తి.. తుపాకీ పట్టుకొని తిరుగుతూ విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనతో విద్యార్థులు భయభ్రాంతులకు గురయ్యారు. కాల్పుల శబ్దాలు రావడంతో తరగతి గదుల్లోంచి బయటకు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన పాఠశాలకు చేరుకున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాంతమంతా ఖాళీ చేయించి.. పోలీసులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.
ఈ పాఠశాలలో సుమారు 1400 మంది విద్యార్థులు ఉన్నారు. దుండగుడు ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం మాత్రం ఇంకా తెలియరాలేదు. కాల్పుల తర్వాత తమ పిల్లల ఆచూకీ కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చెందాయి. సంఘటనా స్థలంలో పేలుడు పరికరాలను కూడా కనుగొన్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఐతే.. పాఠశాలలో ఫైర్ డ్రిల్ జరుగుతుందేమో అనుకున్నామని.. కానీ తర్వాత అవి తుపాకీ చప్పుళ్లని తెలిసి విద్యార్థులంతా ప్రాణభయంతో పరుగులు పెట్టారని స్కూల్‌లో పనిచేస్తున్న ఓ టీచర్ చెప్పుకొచ్చారు. అమెరికాలో పెచ్చుమీరుతున్న గన్ కల్చర్‌తో ఈ మధ్య వరుసగా కాల్పుల ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- అయ్యప్ప భక్తులకు శుభవార్త..60 స్పెషల్ రైళ్లు
- పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్
- ‘వందే మాతరానికి’ 150 ఏళ్లు
- కువైట్ ఉప ప్రధానమంత్రిని కలిసిన కేరళ సీఎం..!!
- Dh100 మిలియన్ యూఏఈ లాటరీ విజేత ఫ్యూచర్ ప్లాన్ రివీల్..!!
- గ్రేస్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలని ఒమన్ పిలుపు..!!
- సౌదీయేతరుల ఆస్తులపై కీలక అప్డేట్..!!
- ఖతార్ లో 25.1% పెరిగిన రెంటల్ కాంట్రాక్టులు..!!
- జీసీసీలో బహ్రెయిన్, ఖతార్ తొలి సముద్ర లింక్ ప్రారంభం..!!
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం







