ఇండియా:విమాన టికెట్లపై ఆఫర్లే ఆఫర్లు

- May 19, 2018 , by Maagulf
ఇండియా:విమాన టికెట్లపై ఆఫర్లే ఆఫర్లు

దిల్లీ: ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆఫర్ల బాట పట్టాయి విమానయాన సంస్థలు. గో-ఎయిర్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్ ఏషియా వంటి సంస్థలు ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి.

దేశీయ బడ్జెట్‌ విమానయాన సంస్థ గోఎయిర్‌ రూ.1,892 ప్రారంభ ధరతో విమాన టికెట్లను అందిస్తోంది. పరిమిత కాల పథకం కింద ఎంపిక చేసిన మార్గాల్లో ఈ ఆఫర్‌ను కల్పించింది గోఎయిర్‌. గోవా-బెంగళూరు మార్గంలో ఒకసారి ప్రయాణానికి టికెట్‌ ధర రూ.1,892గా ఈ ఎయిర్‌లైన్‌ ప్రకటించింది. ఇక ఇదే పథకం కింద హైదరాబాద్‌-అహ్మదాబాద్ మార్గంలో టికెట్‌ ధర రూ.2,169, ముంబయి-నాగ్‌పూర్‌కు టికెట్‌ ధర రూ. 2,417గా ఉంది. జూన్‌ 15, 2018 వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది.

ఇక మరో విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ కూడా రూ.967 ప్రారంభ ధరతో టికెట్లపై ఆఫర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఉడాన్‌ పథకం కింద నడిపే విమానాల్లో ఈ ఆఫర్‌ అందిస్తోంది. దీని ప్రకారం.. లఖ్‌నవూ- అలహాబాద్‌- పట్నాకు ఛార్జీ రూ.967 కాగా.. పట్నా- అలహాబాద్‌- పట్నాకు రూ.1216కే ప్రయాణం చేయవచ్చు. ఇక నాగ్‌పూర్‌- అలహాబాద్‌- నాగ్‌పూర్‌కు రూ.1690గా, ఇండోర్‌ -అలహాబాద్‌-ఇండోర్‌కు రూ.1914గా ఛార్జీలు ఉన్నాయి. దిల్లీ-నాసిక్‌- దిల్లీకి రూ.2665 వసూలు చేస్తారు.

గోఎయిర్‌ బాటలోనే ఎయిర్‌ఏషియా కూడా టికెట్లపై ఆఫర్లు ప్రకటించింది. రూ.1,399 ప్రారంభ ధరతో ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్లు అందిస్తోంది. మిడ్‌ సమ్మర్‌ సేల్‌ కింద ఈ డిస్కౌంట్‌ ఆఫర్‌ను ఇస్తోంది ఎయిర్‌ఏషియా. మే 20వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. మే 14 నుంచి ఆగస్టు 31 మధ్య చేసే ప్రయాణాలకు ఈ డిస్కౌంట్‌ వర్తిస్తుందని ఎయిర్‌ఏషియా తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com