90% శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న "యురేక"
- May 19, 2018
లక్ష్మి ప్రసాద్ ప్రొడక్షన్స్ పతాకంపై కార్తీక్ ఆనంద్ , డింపుల్, షాలినీ , మున్నా ,అపూర్వ హీరోహీరొయిన్లుగా ప్రశాంత్ తాత, లలిత కుమారి నిర్మిస్తొన్న చిత్రం "యురేక ". కార్తీక్ ఆనంద్ దర్శకుడు. ప్రస్తుతం రామానాయుడు స్డూడియోస్ లొ చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సందర్బంగా
నిర్మాత లలిత కుమారి మాట్లాడుతూ.. కార్తీక్ ఆనంద్ ను హీరొగా, దర్శకుడిగా పరిచయం చెస్తూ ప్రశాంత్ గారితో కలిసి సినిమా నిర్మిస్తున్నాము. చిత్రీకరణ చివరి దశకు చెరుకుంది. సినిమా ఔట్ పుట్ చాలా బాగా వస్తొంది.త్వరలొనె ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాము. అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నామన్నారు.
నిర్మాత ప్రశాంత్ తాత మాట్లాడుతూ.. సినిమా 90% చిత్రీకరణ పూర్తయింది. రామానాయుడు స్డూడియోస్ లో ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటొంది. జూలై ఫస్ట్ వీక్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామన్నారు..
డింపుల్ మాట్లాడుతూ.. హీరొయిన్ గా ఇది నా రెండో చిత్రం. సినిమా లొ నా పాత్రకు మంచి ప్రాదాన్యత ఉంటుందన్నారు.
కార్తీక్ ఆనంద్ మాట్లాడుతూ.. "యురేక" తో హీరొగా, దర్శకుడిగా పరిచయమవుతున్నాను. కథే ఈ చిత్రానికి బలం. ప్రతి పాత్రకు ప్రాదాన్యత ఉంటుంది.యూత్ పుల్ ఎంటర్ టైనింగ్ ఎంగెంజింగ్ థ్రిల్లర్ గా "యురేక" ఉంటుంది. కాలేజ్ ఫెస్ట్ నేపధ్యంలొ జరిగే కధ.
టెక్నికల్ గా నాకు మంచి సపొర్ట్ లభించింది. అందరం యంగ్ టీమ్. ఔట్ పుట్ చాలా బాగా వస్తొందన్నారు.యురేక అంటే ఓ కొత్త విషయాన్ని కనిపెట్టడం ద్వారా వచ్చె హ్యాపినెస్. ఇంతకీ మా సినిమాలొ అదెంటనేది సస్పెన్స్. నిర్మాతలు రాజీ పడకుండా నిర్మిస్తున్నారన్నారు.
కార్తీక్ ఆనంద్, మున్నా, డింపుల్ ,షాలినీ, అపూర్వ బ్రహ్మాజీ ,రఘుబాబు, శివన్నారాయణ, వాసు, అభయ్ ,రాకెట్ రాఘవ, మహేష్ విట్టా, మస్త్ అలీ ఆర్.కె. ,వెణుగొపాల్ రావు, కొటేష్ తదితరులు నటిస్తొన్న చిత్రానికి సంగీతం: నరేష్ కుమరన్, డిఓపి: విశ్వ, కూర్పు: గ్యారీ. ఆర్ట్ : అవినాష్ ,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: కృష్ణారెడ్డి,
నిర్మాతలు : ప్రశాంత్ తాత, లలిత కుమారి, దర్శకత్వం: కార్తీక్
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







