ఎన్టీఆర్, త్రివిక్రమ్ ల సినిమా ఫస్ట్ లుక్..!!
- May 19, 2018
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో తారక్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, తమన్ స్వరాలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్కు సంబంధించిన అప్డేట్ను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది.
మొట్టమొదటి సారిగా సిక్స్ ప్యాక్ బాడీతో సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్ అదరగొట్టేశాడు. త్రివిక్రమ్, జూ.ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దు కుంటోన్న విషయం తెలిసిందే. ఇందులో ఎన్టీఆర్ చాలా స్టైలిష్‌గా కండలవీరుడిగా కనపడుతున్నాడు. ఈ రోజు ఆ సినిమా యూనిట్ ట్విట్టర్ ద్వారా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ను విడుదల చేసింది.
చేతిలో కత్తి.. సిక్స్ ప్యాక్ బాడీతో ఉన్న ఎన్టీఆర్ పోస్టర్‌ను ఫ్యాన్ తెగ ఖుషీలో ఉన్నారు. ఇటీవల జిమ్‌లో కసిగా వ్యాయామం చేస్తోన్న జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎట్టకేలకు ఈ సినిమాలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్‌తో కనపడుతున్నట్లు స్పష్టం అయింది. కాగా, ఈ సినిమా పేరు 'అరవింద సమేత...' అని ఉప శీర్షిక 'వీర రాఘవ' అని ఆ సినిమా యూనిట్ ప్రకటన చేసింది.
గతంలో హీరోల క్లాస్ మేకోవర్లతో ఫస్ట్ లుక్‌లను వదిలిన త్రివిక్రమ్.. ఈసారి ఎన్టీఆర్ కోసం యాక్షన్ పార్ట్‌తో ఫస్ట్ లుక్ వదలటం విశేషం. ఎన్టీఆర్ కెరీర్లో ఇది 28వ చిత్రం కాగా, డస్కీ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తోంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఎన్టీఆర్ కూడా తన ట్విటర్లో పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







