బహ్రెయిన్ లో తెలంగాణ వాసికి అంతిమ వీడ్కోలు పలికిన కార్మిక బంధు

- May 19, 2018 , by Maagulf

బహ్రెయిన్: మరొక్కసారి, బహ్రెయిన్ కార్మికబంధు శివకుమార్, తన గొప్ప నిస్వార్థ సామాజిక సేవ ద్వారా మనకు సుపరిచతులయ్యారు. 

ఫతేపూర్, ఆర్మూర్ గ్రామం 'నిజామాబాద్ జిల్లా నివాసి ఎర్రం శంకర్ అంత్యక్రియలు బహ్రెయిన్ లో జరిగింది. ఎర్రాం శంకర్ పది సంవత్సరల నుండి బహ్రెయిన్ లో పనిచేసి రెండు సంవత్సరాల తరువాత ఇండియా వెళ్ళి పెళ్లి చేసు కొని వచ్చాడు అయితే ఆరు సంవత్సరాల వరకు భారతదేశం వెళ్ళ లేదు. శంకర్ అన్నయ్య కూడ బహ్రెయిన్ లో వున్నాడు. శంకర్ వాళ్ళ అన్నయ్య పని చెస్తూన్న కంపెనీకి వచ్చి ఆ రోజు రాత్రి ఇద్దరు కలసి భోజనము చేసిన తరువాత నిద్రపోయారు.  కానీ శంకర్ మాత్రం ఉదయం లేవ లేదు. గుండె పోటుతో నిద్రపోయాడు. శంకర్ కి ఐదు సంవత్సరాలు పాప వుంది. అయితే బందువులు మరియు వాళ్ళ అన్నయ్య, శంకర్ మృతదేహాన్ని స్వస్థలానికి పంపించవద్దు అని అన్నారు.అప్పుడు వాళ్ళ అన్నయ్య కంపెనీ సభ్యులతొ సంప్రందించి, ఐసిఆర్ఎఫ్ఫ్, ఇండియన్ ఎంబాసీ సహకారంతో అంత్య క్రియలు బహ్రెయిన్ లో నిర్వహించడం జరిగింది. ఈ నిస్వార్థ సామాజిక సేవలను అందించిందిన మన బహ్రెయిన్ కార్మిక బంధు డి.వి.శివకుమార్ అభినందనీయులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com