నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లడానికి యత్నించిన వ్యక్తి.
- December 07, 2015
నకిలీ వీసాతో దుబాయ్ వెళ్లడానికి యత్నించిన వ్యక్తిని ఇమిగ్రేషన్ అధికారులు పట్టుకుని రాజీవ్గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు(ఆర్జీఐఏ) పోలీసులకు అప్పగించారు. ఉపాధి నిమిత్తం ఏజెంట్ ద్వారా నకిలీ వీసా పొందిన ప్రకాశం జిల్లాకు చెందిన ఖాదీర్ బాషా(40) సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్కి వెళ్లడానికి యత్నిస్తుండగా అతడి వీసాను పరిశీలించిన అధికారులు నకిలీదిగా గుర్తించారు. వెంటనే అతడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. ఇమిగ్రేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమాన సర్వీస్ లు పునరుద్దరణ
- అంతరిక్ష యాత్రకు తెలుగమ్మాయి..
- హైదరాబాద్ పాస్పోర్టు కార్యాలయానికి అరుదైన పురస్కారం
- పార్టీ నేతల తీరు పై సీఎం చంద్రబాబు అసంతృప్తి
- దుబాయ్లో వీసా మోసం కేసు: 21 మంది దోషులు
- ఖతార్ లో విమాన రాకపోకలు ప్రారంభం
- డ్రగ్స్ కొనుగోలు చేశాను.. అమ్మలేదు: శ్రీరామ్
- TTD: తిరుమలలో శ్రీ వెంకటేశ్వర మ్యూజియం ఏర్పాటు
- ట్యాక్స్ అనేది చట్టబద్ధమైన అవసరం కాదు, వ్యూహాత్మక అత్యవసరం..!!
- కొన్ని యూఏఈ, జీసీసీ ఫ్లైట్స్ తాత్కాలికంగా నిలిపివేత..!!