నిఫా వైరస్: కేరళకు వెళ్ళొద్దని బహ్రెయిన్ హెచ్చరిక
- May 23, 2018
బహ్రెయిన్ జాతీయులు భారతదేశంలోని కేరళకు వెళ్ళరాదని హెచ్చరికలు జారీ చేసింది. కేరళలో భయంకరమైన నిఫా వైరస్ విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడి ఇప్పటికే 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ముంబైలోని బహ్రెయిన్ కాన్సులేట్ ఈ హెచ్చరికను ట్విట్టర్ ద్వారా తమ పౌరులకు చేయడం జరిగింది. సాధారణ ఫ్లూ తరహాలోనే ఈ నిఫా వైరస్ సోకినవారిలో లక్షణాలు కన్పిస్తాయి. 10 మంది ఇప్పటికే ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోగా, 9 మంది నిఫా వైరస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కేరళ పొరుగు రాష్ట్రమైన కర్నాటకలోనూ నిఫా వైరస్‌కి సంబంధించిన హెచ్చరికలు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







